బుధవారం, జూన్ 25, 2014

తళ తళ తారక లాగా...

ఒక చక్కని రిథమ్ తో హాయిగా సాగిపోయే ఓ మధురమైన పాట "ప్రేమకు వేళాయెరా" సినిమా కోసం ఎస్వీకృష్ణారెడ్డి గారు స్వరపరచిన ఈ 'తళ తళ తారకలాగా' పాట. క్యాసెట్ ఇన్ లే కార్డ్ పై రచయిత పేరులేకపోవడం వల్ల ఈ పాట రాసినది సిరివెన్నెలగారో చంద్రబోస్ గారో తెలియలేదు. ఈ చక్కని పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ప్రెమకువేళాయెరా (1999)
సంగీతం : ఎస్వీ కృష్ణారెడ్డి
సాహిత్యం : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్, హరిణి

ఆఆఆఅ..ఆఆఆ.ఆ..ఆఆఅ..ఆఆఆ...
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆఆఆ... పంచవన్నెల రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుక.. 
పంచదారల ప్రేమచినుకా...అఆ...

మాణిక్య వీణవు నువ్వే మలిసంధ్య వేణువు నువ్వే
నామనసు మందిరాన మోగుతున్న
అందమైన అందము నువ్వే
ఆరాద్య దేవత నువ్వే గంధర్వ కాంతవు నువ్వే
స్వర్గాల దారిలోనా నీడనిచ్చు పాలరాతి మేడవు నువ్వే
నీగాలి సోకింది నాకొమ్మ ఊగింది
నీ ప్రేమ తాకింది నాజన్మ పొంగింది

పంచవన్నెల రామచిలుక 
నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుక.. 
పంచదారల ప్రేమచినుకా...అఆ...

నాతేనె విందువు నువ్వే నాలంకె బిందెవు నువ్వే
నాగుండె గంపలోనా ఒంపుకున్న అంతులేని సంపద నువ్వే
నాపొద్దు పొడుపువు నువ్వే నాభక్తి శ్రద్ధవు నువ్వే
చిననాడు దిద్దుకున్న ఒద్దికైన ఓనమాలు నువ్వే నువ్వే
నీ చూపు అందింది నాచెంప కందింది
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది

పంచవన్నెల రామచిలుక 
నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా 

తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరిణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆఆఆ... పంచవన్నెల రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మోలకా
పంచవన్నెల రామచిలుకా.ఆఅ..
ఓ పంచదారల ప్రేమచినుకా..ఆఆఆ...


4 comments:

Ee paata nenu rachinchinade--chandrabose

Thanks a lot చంద్రబోస్ గారు...
క్యాసెట్ ఇన్లే కార్డ్ పై కూడా ఈ ఒక్క పాటకి రచయిత పేరు లేదండీ అందుకే కన్ఫూజ్ అయ్యాను. మీ కామెంట్ ద్వారా ఈ విషయం తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పోస్ట్ లో కూడా కరెక్ట్ చేశాను.

ఈ పాట త్రూ అవుట్ రన్ అయ్యే బీట్, గుండె చప్పుడుతో పోటీ పడుతూ వుంటుంది..నాకు భలే ఇష్టం వేణూజీ..

కరెక్ట్ గా పోల్చారు.. థాంక్స్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.