బాలచందర్ గారు తీసిన చిత్రాలలో విశిష్టమైన స్థానం సంపాదించుకునే చిత్రం అందమైన అనుభవం. ఇందులో విశ్వనాథన్ గారు స్వరపరచిన పాటలన్నీ సూపర్ హిట్సే... వాటిలో ఫాస్ట్ గా సాగే ఈ పాట అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం, ఆత్రేయ గారి సాహిత్యం బాగుంటుంది ఇంతటి ఫాస్ట్ పాటలో లైఫ్ ఫిలాసఫీ భలే చెప్పారనిపించింది. రజనీకాంత్ భలే ఉంటారు ఈ పాటలో. మీరూ చూసి వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అందమైన అనుభవం (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు
శంభో శివ శంభో.. శివ శంభో.. శివ శంభో..ఓ..
వినరా ఓరన్నా ..అనెరా వేమన్న...
జగమే మాయన్నా... శివ శంభో...
నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. నేడే నీదన్న.. శివ శంభో..
వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..
జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..
నిన్న రాదన్న.. రేపూ లేదన్న ..నేడే నీదన్న ...శివ శంభో..ఓ..
అందాన్ని కాదన్న.. ఆనందం లేదన్న..
బంధాలు వలదన్న... బ్రతుకంతా చేదన్న..
సిరులున్నా.. లేకున్నా.. చెలితోడు నీకున్నా..
అడవిలో నువ్వున్నా.. అది నీకు నగరన్నా...ఆ..ఆ..ఆ
వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..
జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..ఓ..
నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. నేడే నీదన్న.. శివ శంభో..ఓ..ఓ..
ఈ తేటిదీ పువ్వు అని అన్నదెవరన్న..
ఏ తేనె తాగిన తీపొకటేకదరన్న..
నీదన్న నాదన్న.. వాదాలు వలదన్న..
ఏదైనా మనదన్న.. వేదాన్నే చదువన్న..ఓ..ఓ...
ఊరోళ్ళ సొమ్ముతో గుడికట్టి గోపన్న..ఆ..
శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న..
భక్తైనా రక్తైనా భగవంతుడేనన్న..
ఈనాడు సుఖమన్న.. ఎవడబ్బ సొమ్మన్నా..
వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..
జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..ఓ..
నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. నేడే నీదన్న.. శివ శంభో..ఓ..ఓ..
2 comments:
ఈ మూవీ టాగ్ లైనే - "ఇది ఒక పాటల పందిరి"..బాలచందర్ గారి సెల్యులాయిడ్ కవితల్లో ఈ సినిమా ఓ మ్యూజికల్ మాజిక్..ఇక ఈ పాటైతే రజనీ మార్క్ ఫిలాసఫీని పాప్ తో రీమిక్స్ చేసినట్టుంటుంది..
కరెక్ట్ గా చెప్పారు శాంతి గారు.. థాంక్స్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.