70's, 80's లో బాలు గారు జానకి గారు కలిసి పాడిన కొన్ని పాటలు వింటూంటే పాట పాడినట్లుగా కాక వాళ్ళిద్దరూ పోటా పోటీగా ఆటాడుకున్నట్లుగా అనిపిస్తుంటుంది, అలాంటి ఓ అందమైన పాట ఎర్రగులాబీలు లోని ఈ పాట. ఇళయరాజా గారి సంగీతానికి ఇద్దరూ వందశాతం న్యాయం చేశారనడంలో ఏ సందేహంలేదు. మీరూ ఆనందించండి ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఎర్ర గులాబీలు (1979)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి
లలలలల లా..
ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ
ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ
ఎదలో తొలి వలపే..
రోజాలతో పూజించనీ..
విరి తెనెలే నను తాగనీ
నా యవ్వనం పులకించనీ..
అనురాగమే పలికించనీ
కలగన్నదీ నిజమైనదీ..
కధలే నడిపిందీ..ఈ..ఈ..
ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ
ఎదలో తొలి వలపే..
పయనించనా నీ బాటలో..
మురిపించనా నా ప్రేమలో
ఈ కమ్మనీ తొలి రేయిని..
కొనసాగనీ మన జంటనీ
మోహాలలో మన ఊహలే..
సాగే చేలరేగే..ఏ..ఏ..
ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ
ఎదలో తొలి వలపే విరహం జత కలిసే
మధురం ఆ తలపే నీ పిలుపే..ఏ..ఏ
ఎదలో తొలి వలపే..
2 comments:
ఈ సినిమా అంటే యెంత భయమో, పాటంటే అంత పిచ్చి..ఇళయరాజాగారు విశ్వరూపం చూపిన సాంగ్స్ లో ఒకటి..
అవునండీ సినిమా కొంచెం భయానకంగానే ఉంటుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.