శనివారం, జూన్ 21, 2014

దాసోహం.. దాసోహం.. దాసోహం

రేడియో నాకు పరిచయం చేసిన మరో చక్కని పాట ఇది. మహదేవన్ గారు, ఆత్రేయ గారు, బాలు గారు, సుశీల గారు అందరూ కలిసి చేసిన మ్యాజిక్ ని మీరూ ఆస్వాదించి ఎలా ఉందో చెప్పండి. ఈ సినిమా తాలూకు వీడియో నాకు లభించలేదు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 

 
చిత్రం : పెళ్ళి చూపులు (1983)
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : ఆత్రేయ 
గానం : బాలు, సుశీల

దాసోహం.. దాసోహం.. దాసోహం ...
దాసోహం.. దాసోహం.. దాసోహం

మల్లెలాంటి మనసుకు.. మనసులోని చలువకు
చలువలోని చెలిమికి .. దాసోహం
మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు
చలువలోని చెలిమికి .. దాసోహం

దాసోహం దాసోహం దాసోహం.. 
దాసోహం దాసోహం దాసోహం

వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు .. దాసోహం
వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు .. దాసోహం

దాసోహం.. దాసోహం.. దాసోహం
దాసోహం.. దాసోహం.. దాసోహం

నేల పరిచింది పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వాగతాలు నీ రాకకు
నేల పరిచింది ఈ పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వాగతాలు నీ రాకకు
ఎదురు వచ్చింది నీ చూపు నా తోడుకు
ఎదురు వచ్చింది నీ చూపు నా తోడుకు
కలిసి నడిచింది.. కబురులాడింది.. 
కడకు చేర్చింది నీ నీడకు

మల్లెలాంటి మనసుకు.. మనసులోని చలువకు..
చలువలోని చెలిమికి.. దాసోహం
వెల్లువంటి మనిషికి.. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు.. దాసోహం

దాసోహం దాసోహం దాసోహం 
దాసోహం దాసోహం దాసోహం

నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి
నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి
తలుపు తెరిచింది నీ రూపే నా మనసుకి..
తలుపు తెరిచింది నీ రూపే నా మనసుకి..
అడుగు పెట్టింది.. దీపమెట్టింది.. 
దేవతయ్యింది నా ఇంటికి

వెల్లువంటి మనిషికి.. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు.. దాసోహం
మల్లెలాంటి మనసుకు.. మనసులోని చలువకు ..
చలువలోని చెలిమికి.. దాసోహం

దాసోహం దాసోహం దాసోహం
దాసోహం దాసోహం దాసోహం

4 comments:


రేడియో లో చిన్నప్పుడు విన్న పాట చాలా రోజులకి విన్నా ..మంచిపాట Radhika (nani)

థాంక్స్ రాధిక గారు..

మధువొలికే పదాలకీ, మరువ లేని బాణీకీ, మధురమైన వాణికీ -దాసోహం..దాసోహం..దాసోహం..

వహ్వా వహ్వా భలే చెప్పారు శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.