బుధవారం, జూన్ 04, 2014

అలై పొంగెరా కన్నా...

అలైపాయుదే అన్న కర్ణాటకసంగీత కృతికి వేటూరి వారి అందమైన తెలుగు సేత, రెహ్మాన్ చక్కని సంగీతంలో. ఈ పాట విన్న ప్రతీసారి తనువో శిరస్సో మనకి తెలియకుండా లయకు అనుగుణంగా నాట్యమాడడం మొదలెడితే మనసు మురిసి బృందావనంలో కన్నయ్య లీలలను సాక్షాత్కరింప చేసుకుంటుంది. సినిమాలో ఉపయోగించినది చాలా చిన్న బిట్ అందుకని ఇక్కడ పూర్తి ఆడియో ఉన్న ఫైల్ ఎంబెడ్ చేశాను. యూట్యూబ్ పని చేయని వారు ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.   



చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : హరిణి , కల్పన , కళ్యాణి మీనన్

అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున  
ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమది
అలై పొంగెరా కన్నా ... అ అ అ

నిలబడి వింటూనే చిత్తరువైనాను 
నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రాదొరా ప్రాయమున 
యమున మురళీధర యవ్వన
అలై పొంగేరా కన్నా ... అ అ అ

కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా
కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమునా కనుబొమ్మలటు పొంగే

కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే
కన్నె వయసు కళలొలికే వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే

అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిషాంత మహీచ శకుంతమరంద మెడారి గలాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా

కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలె ఆవేదనా ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలె ఆవేదనా ఇతర భామలకు లేని వేదనో

ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులె చిలుకు 
మధుర గాయమిది గేయము పలుకగ

అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా
ఆనంద మోహన వేణుగానమున 
ఆలాపనే కన్నా కన్నా ... అ అ అ 


2 comments:

రెహ్మాన్ క్లాసికల్ టచ్ తో ఇచ్చిన ట్యూన్స్ తక్కువే ఐనా దేనికదే చాలా బావుంటాయి వేణూజీ..

కరెక్ట్ శాంతి గారు తన ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఎంత హుషారుగా ఉంటాయో మెలోడీస్ కూడా అంతే కమ్మగా ఉంటాయి.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.