బుధవారం, జూన్ 18, 2014

గోరంత దీపం కొండంత వెలుగు..

జీవితంలో వచ్చే ఆటుపోటులను ఎలా ఎదుర్కోవాలో జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించే ఈ చక్కని పాట సినారే గారు రాసినది. బాపు గారి అభిరుచికి అద్దం పట్టే ఈ పాటకి కె.వి.మహదేవన్ గారు స్వరపరచిన బాణి మృదువుగా సాగుతూ ఆ భావాలను మనసుకు హత్తుకునేలా చేస్తుంది. ఈ చక్కని పాటని మీరూ వినండి. ఈ పాట సినిమాలో టైటిల్స్ కి నేపధ్యగీతంగా వస్తుంది అది ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


 
చిత్రం : గోరంత దీపం (1978)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, పి.సుశీల

గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..

కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ..
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు..
కరిమబ్బులు కమ్మే వేళ..మెరుపు తీగే వెలుగూ..
కారు చీకటి ముసిరే వేళ..వేగు చుక్కే వెలుగు..
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు..
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు..
దహియించే బాధల మద్యన సహనమే వెలుగు!!
ఆహాఆఆఆఆ ఆఆఆఆఅ

గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు..

కడలి నడుమ పడవ మునిగితే..కడదాకా ఈదాలి..
కడలి నడుమ పడవ మునిగితే..కడదాకా ఈదాలి..
నీళ్ళు లేని ఎడారిలో..ఓఓఓఓఓఓ
నీళ్ళు లేని ఎడారిలో.. కన్నీళ్ళైనా తాగి బతకాలి..
నీళ్ళు లేని ఎడారిలో.. కన్నీళ్ళైనా తాగి బతకాలి..
ఏ తోడు లేని నాడు..నీ నీడే నీకు తోడు!!
ఏ తోడు లేని నాడు..నీ నీడే నీకు తోడు!!
జగమంతా దగాచేసినా.. 
చిగురంత ఆశను చూడు..

చిగురంత ఆశ జగమంత వెలుగు..
గోరంత దీపం కొండంత వెలుగు..
చిగురంత ఆశ జగమంత వెలుగు.. 


4 comments:

తల్లిగా, ప్రియురాలిగా, ఇల్లాలిగా, ఒక్కో పాత్రనీ పొషిస్తూ, యెన్నో ఒడిదుడుకులను యెదురుకుంటూ జీవితం లో పొందిగ్గా ఒదిగి పోయే స్త్రీ ప్రకృతికి ప్రతిరూపమే కదా..

కాదనలేని సత్యం శాంతి గారు.. థాంక్స్..

దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు.

వందశాతం నిజం అజ్ఞాత గారూ ఆ వెలుగే బాధలనుండి బయటపడే దారి చూపిస్తుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.