శనివారం, జూన్ 07, 2014

ఆయతనవాన్ భవతి...

సూత్రధారులు సినిమా కోసం విశ్వనాధ్ గారు మంత్రపుష్పం లోని కొంతభాగాన్ని ఉపయోగించుకుని దానికి మహదేవన్ గారితో చక్కని బాణీ కట్టించి ఇలా చిత్రీకరించారు. ఇది చూసి "పవిత్రమైన మంత్రపుష్పాన్ని ఇలా సినిమాల్లో వాడుకోవడమేమిటి.." అని కోప్పడినవాళ్ళూ ఉన్నారు... "ఆహా మా మంత్రపుష్పమే ఇది.." అని మురిసిపోయిన వాళ్ళూ ఉన్నారు... ఏది ఏమైనా నాకు మాత్రం ఈ పాట చాలా ఇష్టం... రమ్యకృష్ణ నాట్యం ఇష్టం.. అలాగే తనానానానా అని తను గొంతు కలపగానే అంతవరకూ సీరియస్ గా ఉన్న అతని మోములో మెరిసే నవ్వు చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : మంత్రపుష్పం
గానం :  బాలు, ఎస్.పి.శైలజ

యోఽపాం పుష్పం వేద 
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
చంద్ర మా వా అపాం పుష్పమ్ 
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
య ఏవం వేద... తనానా..నానా..
య ఏవం వేద... తనానా..నానా..
యోఽపామాయతనం వేద... తానా నానన నానాన...
ఆయతనవాన్ భవతి... 
హా..ఆ.ఆ.ఆ.. ఆయతనవాన్ భవతీ... ఆయతనవాన్ భవతీ...
య ఏవం వేదా... యోఽపామాయతనం వేదా.. 
ఆయతనవాన్ భవతీ.ఈఈ.. ఆయతనవాన్ భవతీ.ఈఈ....

అగ్నిర్వా అపామాయతనమ్, ఆయతనవాన్ భవతీ..ఈఈ..
యోఽగ్నేరాయతనం వేద, ఆయతనవాన్ భవతీ..
ఆపో వా అగ్నేరాయతనమ్...
ఆ.ఆ.ఆ.. ఆయతనవాన్ భవతీ... ఆయతనవాన్ భవతీ...
య ఏవం వేదా... యోఽపామాయతనం వేదా.. 
ఆయతనవాన్ భవతీ.ఈఈ.. ఆయతనవాన్ భవతీ.ఈఈ....

వాయుర్వా అపామాయతనమ్, ఆయతనవాన్ భవతీ..ఈ..
యో వాయోరాయతనం వేద, ఆయతనవాన్ భవతీ..
ఆపో వై వాయోరాయతనమ్,
ఆ.ఆ.ఆ.. ఆయతనవాన్ భవతీ... ఆయతనవాన్ భవతీ...
య ఏవం వేదా... యోఽపామాయతనం వేదా.. 
ఆయతనవాన్ భవతీ.ఈఈ.. ఆయతనవాన్ భవతీ.ఈఈ.... 2 comments:

మంత్రమంటి పాట..

థాంక్స్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.