శనివారం, మే 10, 2014

నీవే నీవే నీవే నేనంటా...

చక్రి సంగీత దర్శకత్వంలో చక్కని లిరిక్స్ తో పెద్దాడ మూర్తి రాసిన ఒక చక్కని అమ్మ పాట ఇది. ఈ లిరిక్స్ నాకు చాలా ఇష్టం అలాగే చిత్రీకరణ కూడా. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమ్మానాన్న ఓ తమిళమ్మాయి (2003)
సంగీతం : చక్రి 
సాహిత్యం : పెద్దాడ మూర్తి 
గానం : చక్రి 

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..

నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా..
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికేవే.. కన్నీరే వస్తే కొంగై తుడిచేవే 

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..

నే గెలిచిన విజయం నీదే.. నే ఓడిన క్షణమూ నాదే..
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా.. 
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే.. ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే
 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. 
 

2 comments:

ఈ పాటలో యెక్కడా తల్లీ కొడుకులని మెన్షన్ చేయకుండా వారి అనుబంధం తెలిసేలా రాయాలని డైరెక్టర్ చెప్పారట..రాసిన మూర్తిగారు అంతే అందం గా తీసిన పూరీ జగన్నాధ్ గారూ ఇద్దరూ అభినందనీయులు..

ఓహో అలా ప్రత్యేకంగా అడిగి మరీ రాయించుకున్నారనే విషయం తెలీదు శాంతి గారు. మూర్తిగారే అలా రాశారేమో అనుకున్నాను. థాంక్స్ ఫర్ ద అప్డేట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.