ఆదివారం, మే 25, 2014

ఉప్పెనంత ఈ ప్రేమకీ...

దేవీశ్రీ, బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మరో అధ్బుతమైన పాట ఇది. ఈపాటకి మొదట్లోనూ తర్వాత పాట మధ్యలోనూ వచ్చే సిగ్నేచర్ గిటార్ బిట్ చాలా బాగుంటుంది. చిత్రీకరణ అల్లూ అర్జున్ డాన్స్ కూడా ఈ పాటలో హైలైట్. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆర్య-2 (2009)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : బాలాజి
గానం: కె.కె

ఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో
తీయనైన ఈ బాధకీ .. ఉప్పు నీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
ఓ నిన్ను చూసే ఈ కళ్ళకీ .. లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని ఫిక్షన్లెందుకో

I Love You .. నా ఊపిరి ఆగిపోయినా
I Love You .. నా ప్రాణం పోయినా
I Love You .. నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో


కనులలోకొస్తావు .. కలలు నరికేస్తావు
సెకనుకోసారైనా చంపేస్తావూ
మంచులా ఉంటావు .. మంట పెడుతుంటావు
వెంటపడి నా మనసు మసి చేస్తావూ
తీసుకుంటె నువ్వు ఊపిరీ .. పోసుకుంట ఆయువే చెలీ
గుచ్చుకోకు ముళ్ళులా మరీ గుండెల్లో సరా సరి !

I Love You .. నా ఊపిరి ఆగిపోయినా
I Love You .. నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో


చినుకులే నిను తాకీ మెరిసిపోతానంటే
మబ్బులే పోగేసి కాల్చెయ్యనా
చిలకలే నీ పలుకూ తిరిగి పలికాయంటే
తొలకరే లేకుండా పాతెయ్యనా
నిన్ను కోరి పూలు తాకితే .. నరుకుతాను పూలతోటనే
నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే !

I Love You .. నా ఊపిరి ఆగిపోయినా
I Love You .. నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకీ .. గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికీ భాషే ఎందుకో


2 comments:

ఇలాంటి పాటలని మాస్టరైజ్ చేశారు దేవిశ్రీప్రసాద్..

అవునండీ శాంతి గారు కరెక్ట్.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.