చిరంజీవి సినిమాల్లోని ఎవర్ గ్రీన్ సాంగ్స్ లో ఇదీ ఒకటి, వేటూరి ఇళయరాజా గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట ఈరోజు విన్నా కూడా ఫ్రెష్ గానే ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అభిలాష (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
తేనెవాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే
గాలీవానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే
విసిరే కొసచూపే ముసురై పోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తలదాచుకో
తాపాలలో ఉన్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
తారత్తా తరతత్ తరతా
తారత్తా తరతత్ తరరా
పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతీ చామంతీ ముద్దాడుకున్నాయిలే
2 comments:
క్రియేటివ్ కమర్షియల్స్ + యండమూరి + ఇళైరాజా + చిరంజీవి = సూపర్ హిట్ మూవి..
థాంక్స్ శాంతి గారు.. హహహ ఒకప్పటి సూపర్ హిట్ ఫార్ములా అంటారా ఇది :-))
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.