బుధవారం, మే 07, 2014

పెదవే పలికిన మాటల్లోన...

నాని సినిమా కోసం రెహ్మాన్ ట్యూన్ చేసిన ఒక చక్కని పాట. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : నాని (2004)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఉన్నిక్రిష్ణన్, సాధనాసర్గం

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మా
నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మా
నా ఆలి ఆమ్మగా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగ కమ్మగా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్లో ఒదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టే వాడు నా కడుపున పుట్టే వాడు
ఇద్దరికి ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్లు సాకనా చల్లగ చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసి కూనా ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలి జో
పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
 
ఎదిగీ ఎదగని ఓ పసి కూనా ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలి జో
బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో 

 

2 comments:

ఆలస్యం గా చూస్తున్నా..మీరు వేసిన ఒక్కో అమ్మ పాట,మా అమ్మ తో గడిపిన క్షణాలని గుర్తు చేసేలా వున్నాయి..గుర్తు చెస్తున్నయి..థాంక్యూ వేణూజీ..

చాలా సంతోషం శాంతి గారు, ప్లెజర్ ఈజ్ మైన్.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.