శనివారం, మే 17, 2014

దేశమ్ము మారిందోయ్...

ఈ ఎన్నికలలో చక్కని తీర్పు చెప్పిన ఓటరులకు హృదయపూర్వక అభినందనలు. అలాగే విజయం సాధించిన విజేతలందరకూ ముఖ్యంగా మోడీ, చంద్రబాబులకు అభినందనలు. వారి వారి నాయకత్వంపై నమ్మకముంచి "కష్టాలు తీరేనోయి... సుఖాలు నీవేనోయి.." అని పాడుకుంటూ ఓట్లు వేసి గెలిపించిన దేశ, రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకమైన పరిపాలనను అందించి దేశాభ్యుదయానికి రాష్ట్ర పునర్నిర్మాణానికి పాటుపడతారని ఆశిస్తున్నాను. 

కేవలం సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంతోనే సరిపోలేదంటూ ప్రజలలో శ్రమైక జీవన విధానాన్ని ప్రేరేపించే ఈ పాట చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రానికి రాజధాని పునర్నిర్మాణం ఇదే తరహాలో చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో నేపధ్యంలో కనిపిస్తున్న సన్నివేశాలు నాగార్జున సాగర్ డామ్ నిర్మాణానికి సంబంధించినవి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : రాముడు భీముడు (1964) 
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : కొసరాజు 
గానం : ఘంటసాల, సుశీల, కోరస్

దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్ 
కష్టాలు తీరేనోయ్ .. సుఖాలు నీవేనోయ్
కష్టాలు తీరేనోయ్ .. సుఖాలు నీవేనోయ్
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్

 
కొండలు కొట్టి .. కొట్టి
డ్యాములు కట్టీ .. కట్టి
నీళ్ళను మలిపి .. మలిపి
చేలను తడిపి .. తడిపి
కురిసే చక్కని రోజు మనకు వస్తుందోయ్ … వస్తుంది 
 
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
 
 
కండల్ని కరగదీయి .. బండల్ని విసరివెయ్యి .. నీదేలె పైచేయి
కండల్ని కరగదీయి .. బండల్ని విసరివెయ్యి .. నీదేలె పైచేయి
భాగ్యాలు పండునోయి .. పాతళ్ళు నిండునోయి
 
భాగ్యాలు పండునోయి .. పాతళ్ళు నిండునోయి 
సిరులు చిందునోయి .. ఆశలు అందునోయి
సిరులు చిందునోయి .. ఆశలు అందునోయి 
చేయి చేయి కలపాలి రావయా బావయ్యా
 
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్

 
గ్రామాల బాగుచెయ్యి .. దీపాల వెలుగునియ్యి .. జేజేలు నీకోయి …
గ్రామాల బాగుచెయ్యి .. దీపాల వెలుగునియ్యి .. జేజేలు నీకోయి …
చిట్టి చీమలన్ని పెద్ద పుట్ట పెట్టు కదా కదా
ఎందరో తమ రక్తాన్ని చిందించిరి కదా కదా
ఆక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే
 
ఆక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే 

త్యాగమంటె ఇదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే
ఐకమత్యమిదే ఇదే .. ఇదే ఇదే ఇదే ఇదే
అనుభవమ్ము నీదేనోయి ఆనందం నీదేనోయి
అనుభవమ్ము నీదేనోయి ఆనందం నీదేనోయి
నిజమౌ శ్రమజీవివంటే నీవెనోయ్ నీవోనోయ్
 
దేశమ్ము మారిందోయ్ .. కాలమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. దేశమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్ .. దేశమ్ము మారిందోయ్
దేశమ్ము మారిందోయ్… దేశమ్ము మారిందోయ్ 


2 comments:

చాలా యాప్ట్ సాంగ్ వేణూజీ..యెంతో లోటు బడ్జెట్ తో మొదలవుతున్న మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బావుండాలని అందరం కోరుకుందాము..వీలైనంత వరకూ కంట్రిబ్యూట్ చేద్దాం..

అవునండీ లోటు బడ్జెట్ అయినా కూడా ఆత్మవిశ్వాసంతో వనరులు సక్రమంగా వినియోగించుకుంటూ రాష్ట్రం పురోభివృద్ది సాధించాలని కోరుకుందాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.