శుక్రవారం, మే 09, 2014

చిన్ని తండ్రీ నిను చూడగా...

అమ్మకి పాపాయి ఎంత అపురూపమో చెప్తూ అమ్మ ప్రేమను చక్కగా కళ్లముందుంచే ఈ పాట నా ఆల్ టైమ్ ఫేవరెట్. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : సిసింద్రీ (1995)
సంగీతం : రాజ్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : స్వర్ణలత 

చిన్నితండ్రీ నిను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేను రా
అందుకే అమ్మ ఒడిలోనే దాగుండిపోరా

చిన్నితండ్రీ నిను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా 

ఏ చోట నిమిషం కూడా ఉండలేడు
చిన్నారి సిసింద్రీలా చిందు చూడు
పిలిచినా పలకడూ వెతికినా దొరకడు
మా మద్య వెలిసాడు ఆ జాబిలి
ముంగిట్లో నిలిపాడు దీపావళి
నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు   


చిన్నితండ్రీ నిను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేను రా 

ఆ మువ్వగోపాలుళ్ళా తిరుగుతుంటే
ఆ నవ్వే పిల్లంగ్రోవై మోగుతుంటే
మనసున నందనం విరియదా ప్రతి క్షణం
మా కంటి వెలుగులే హరివిల్లుగా
మా ఇంటి గడపలే రేపల్లెగా
మా ఈ చిన్ని రాజ్యానికి యువరాజు వీడు

చందమామ చుసావటోయ్ అచ్చం నీలాంటి మా బాబుని
నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే
చందమామ చుసావటోయ్ అచ్చం నీలాంటి మా బాబుని 

2 comments:

మీ చిన్ని కన్నయ్యలు చాలా బావున్నారు వేణూజీ..

నచ్చినందుకు సంతోషం శాంతి గారు, థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.