వచ్చే ఆదివారం పదకొండో తారీఖు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వారం రోజులు కమ్మనైన అమ్మపాటలు తలచుకుందామా. ముందుగా చిన్న చిన్న హ్యూమన్ ఎమోషన్స్ ని సైతం చక్కగా తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలోని ఈ అమ్మ పాట మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : వనమాలి
గానం : శశికిరణ్, శ్రావణభార్గవి
అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ
నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకీ
ఏ క్షణం ఎదురవుతావొ జోల పాటవై
ఆకలని అడగక ముందే నోటిముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావొ జాబిలమ్మవై
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
చిన్ని చిన్ని తగవులె మాకు లోకమైన వేళా
నీ వెతలు మనసెపుడైన పోల్చుకున్నదా
రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు వేకువున్నదా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
చిన్ని చిన్ని తగవులె మాకు లోకమైన వేళా
నీ వెతలు మనసెపుడైన పోల్చుకున్నదా
రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు వేకువున్నదా
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
(ఆడియోలో పైన ఉన్న రెండో చరణాన్ని సినిమాలో ఈ క్రింది చరణంతో రిప్లేస్ చేశారు)
నీకు పసిపాపలమేగ ఎంత ఎదుగుతున్నా
జాలిపడి మాజతలోనే ఉండిపో ఇకా
ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే
నీకు తన బదులుగ కొత్త జన్మ నివ్వడా
2 comments:
"నువు కావాలే అమ్మా-నను వీడద్దే అమ్మా"..ఈ వాక్యాలు యెప్పుడు విన్నా కళ్ళ లోంచి నీళ్ళు సుళ్ళు తిరుగుతూ వచ్చేస్తాయి..మమ్మల్ని వీడి రెండేళ్ళైనా అమ్మ ఙాపకాలే మనసునిండా..
థాంక్స్ శాంతి గారు.. అవునండీ అమ్మ జ్ఞాపకాలు అంతే...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.