ఆదివారం, మే 18, 2014

తలచి తలచి చూస్తే...

ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా చేసిన మాంచి మెలోడీ ఇది, విషాద గీతమైనా కూడా నాకు చాలా ఇష్టం అదీకాక శ్రేయా ఘోషల్ పాడిన పాట కనుక నచ్చకుండా ఎలా ఉంటుంది. ఈ అందమైన పాటను మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : 7/G బృందావన్ కాలని (2004)
సంగీతం : యువన్ శంకర్ రాజ
సాహిత్యం : శివగణేష్, ఏ.ఎం రత్నం
గానం : శ్రేయా ఘోషల్

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకొంటినీ

తెరిచి చూసి చదువువేళ
కాలి పోయే లేఖ రాసా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకొంటినీ

కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కధనిపుడు
రాలిపొయినా పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలచుకొనును దారులు ఎపుడు
పగిలిపొయిన గాజులు అందమా
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
ఒడిలో వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వప్నం కానులే ప్రియతమా
కనులూ తెరువుమా

మధురమైన మాటలు ఎన్నో
కలసిపోవు ఈ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా..ఆఆఅ..
చెరిగి పోని చూపులు అన్నీ
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్నూ మరచునా
వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవూ
కళ్ళ ముందు సాక్షాలున్నాతిరిగి నేను వస్తా
ఒక సారి కాదురా ప్రియతమా
ఎపుడూ పిలిచినా

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకొంటినీ


4 comments:

Nice soothing song. This reminded me "Telusuko nanne" from Kavya's diary.

$

థాంక్స్ సిద్ గారు..

మొదట ఈ పాట విన్నపుడు అద్భుతమనిపించింది..కానీ మూవీ లో చూసినప్పుడు చాలా దిగులుగా అనిపించింది..

అవునండీ సినిమాలో సిట్యుయేషన్ అలాంటిది కదా... థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.