మంగళవారం, మే 13, 2014

ఓ మనసా తొందరపడకే...

సంధర్బానుసారంగా భువన చంద్ర గారు రాసిన ఒక చక్కని పాట మీకోసం... చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఒక చిన్నమాట(1997) 
సంగీతం : రమణి భరద్వాజ్ 
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర

ఆఆ..ఆఆ...ఆఆఆ... 

లల్లలల్లలాలల లల్లలల్లలాలల 
  
 ఓ మనసా తొందర పడకే
పది మందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచెం వినవే
వరమిచ్చిన దేవుని చూసే
సుముహూర్తమొస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర 
 
ఓ మనసా తొందర పడకే
పది మందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచెం వినవే
చిరు నవ్వుల దేవిని చూసే
సుముహూర్త మొస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర

చెప్పవమ్మ చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట

చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట


తాజా గులాబి కన్నా మురిపించు మల్లెల కన్నా
మెరిసే తార కన్నా తన తలపే నాకు మిన్న
ఓ... వేదాల ఘోష కన్నా చిరుగాలి పాట కన్నా
ప్రియమార నన్ను తలిచే తన మనసే నాకు మిన్న

మోహం తొలి మోహం కను గీటుతున్న వేళ
రాగం అనురాగం ఎద పొంగుతున్న వేళ
చెప్పాలి ఒక చిన్న మాట

చెప్పవమ్మ చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట

చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట


నాలోని ఆశ తానై తనలోని శ్వాస నేనై
రవళించు రాగమేదో పలికిందీ క్షణాన నాలో

ఓ... నా కంటి పాప తానై తన కొంటె చూపు నేనై
ఆడేటి ఊసులన్నీ మెదిలాయీ క్షణాన నాలో
గాలి చిరుగాలి కబురైనా చేర్చలేవా
చెలిమి నిచ్చెలిమి ఒకమారు చూపలేవా
విరహాన వేచే క్షణాన

చెప్పవయ్య చెప్పు ఒక చిన్న మాట
చిన్నదాని మనసు నీతో అన్న మాట

చెప్పు చెప్పు చెప్పు ఒక చిన్న మాట
చిన్నవాడి మనసు నీతో అన్న మాట


ఓ మనసా తొందర పడకే
పది మందిలో అల్లరి తగదే
కను చూపులు కలిసే వేళ
నా మాటలు కొంచెం వినవే
చిరు నవ్వుల దేవిని చూసే
సుముహూర్తమొస్తున్న వేళ
నీకెందుకే ఈ తొందర

లల్లలల్లలల్లలల్ల లల్లలాలా
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా
లల్లలల్లలల్లలల్ల లల్లలాలా 


3 comments:

శరత్ చంద్ర గారి "పడవ మునక" నవల ఏకవీర సినిమాకే కాక ఈ మూవీ కి కూడా ఇన్స్పిరేషనేమో అనిపిస్తుంది నాకు..

ఓహో ఆ నవల గురించి నాకు తెలియదండీ థాంక్స్.

శరత్ చంద్ర ఛటర్జీ గారి రచనల్లో "పడవ మునక" అనే నవల ఉందంటారా (నాకు తెలియక అడుగుతున్నాను)? నాకు తెలిసి ఈ సబ్జెక్ట్ మీద రవీంద్రనాథ్ టాగోర్ గారి "The Wreck" అనే నవల ఉంది. దీన్నే "నౌకాభంగం", "పడవ మునక" అంటారు. మరి "పడవ మునక" పేరుతోనే శరత్ గారి నవల కూడా ఉందేమో శాంతి గారు నా సందేహ నివృత్తి చేస్తే thanks.

అలాగే 1950 వ దశకపు తెలుగు సినిమా "చరణదాసి" కి (ANR,NTR) టాగోర్ గారి ఈ నవల ఆధారం అంటారు. ఇదే నవల "ఏకవీర" సినిమాకి కూడా ఇన్స్పిరేషనా చెప్పగలరు (విశ్వనాధ సత్యనారాయణ గారి రచనల్లో "ఏకవీర" అని ఒకటి ఉంది మరి). నేనైతే "ఏకవీర", ఈ టపాలో చెప్పిన "ఒక చిన్న మాట" సినిమాలు రెండూ చూడలేదు, అందుకని నాకు తెలియదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.