ఆదివారం, మే 11, 2014

మాతృదినోత్సవ శుభాకాంక్షలు...

బ్లాగ్ మిత్రులందరకూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు... ఈ ప్రత్యేక సంధర్బంలో అమ్మప్రేమను తలచుకుంటూ... కీరవాణి గారు స్వరపరచిన ఈ కమ్మని అమ్మపాట మీ అందరి కోసం. సౌందర్య ఈ పాటలో అమ్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది, అలాగే ఈ చిన్నారి బాబు కూడా చాలా చక్కగా నటించాడు తను పి.బి.శ్రీనివాస్ గారి మనవడుట. ఈ పాట చిత్రీకరణ కూడా నాకు బాగా ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి.చిత్రం : ప్రియరాగాలు(1997)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర 

చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
నా ప్రేమ పోతపోసి కన్నానురా
నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా
నీలో ఉన్నా.. నీతో ఉన్నా.. చిన్నా...

అటు చూడు అందాల రామచిలకనీ
చూస్తోంది నిన్నేదో అడుగుదామనీ
నీ పలుకు తనకి నేర్పవా అనీ
ఇటు చూడు చిన్నారి లేడిపిల్లనీ
పడుతోంది లేస్తొంది ఎందుకోమరీ
నీలాగ పరుగు చూపుదామనీ
కరిగిపోని నా తీపి కలలనీ
తిరిగిరాని నా చిన్నతనమునీ
నీ రూపంలో చూస్తూ ఉన్నా 


చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
  


తూనీగ నీలాగ ఎగరలేదురా
ఆ తువ్వాయి నీలాగ గెంతలేదురా
ఈ పరుగు ఇంక ఎంతసేపురా
ఈ ఆట ఈ పూట ఇంక చాలురా
నా గారాల మారాజ కాస్త ఆగరా
నీ వెంట నేను సాగలేనురా
ఎంతవెతికినా దొరకనంతగా
ఎంత పిలిచినా పలకనంతగా
వెళ్ళిపోకమ్మా..రారా కన్నా

చిన్నా చిరు చిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
నా ప్రేమ పోతపోసి కన్నానురా
నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా
నీలో ఉన్నా.. నీతో ఉన్నా.. 

  

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఈ జగత్తులో అందరికీ అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన అమ్మవారి గురించిన ఓ చక్కని తమిళ పాటతో ఈ సిరీస్ ముగించ దలచుకున్నాను. ఇళయరాజా గారు స్వరపరచిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ తాయిమూగాంబికే సినిమాను తెలుగులోకి డబ్బింగ్ కానీ రీమేక్ కానీ చేశారేమో తెలియదు నాకైతే ఎక్కడా దొరకలేదు అందుకే తమిళ్ వీడియోనే ఇస్తున్నాను.

అలాగే ఈ పాటను ప్రాణంగా ప్రేమించే ఒక ఫ్రెండ్ ఈ పాటకు తెలుగులో రాసుకున్న లిరిక్స్ ఈ క్రింద ఇస్తున్నాను. పాటకు ప్రతిపదార్ధాలతో పూర్తి అనువాదం కాకపోయినా ట్యూన్ కి సరిపోయే విధంగా అదే ఆర్ధం వచ్చేలా రాసుకున్న పాట ఇది. నాకు బాగా నచ్చింది, మీరూ ఆస్వాదించండి.శివ శక్త్యా యుక్తోయది భవతి శక్త ప్రభవితుం
నచే దేవం దేవోనఖలు కుశలః స్పందితుమపి..ఆ ఆ ఆ
అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది భిరవీ
ప్రణుంతుం స్తోతుం వ కధమకృత పుణ్యః ప్రభవవి ఈ ఈ..ఆ ఆ

జనని జననీ - జగం నీ వరమనీ
జనని జననీ - జగం నీ వరమనీ
జగత్కారిణివీ - పరిపూరణివీ
జగత్కారిణివీ - పరిపూరణివీ
జగత్కారిణివీ - పరిపూరణివీ
జనని జననీ - జగం నీ వరమనీ
జననీ..జననీ..జననీ..జననీ

సర్వ మంత్రమ్ముల.. సర్వయంత్రమ్ముల
బీజాక్షరివే..బిందు రూపానివే
బీజాక్షరివే..బిందు రూపానివే
ప్రణవ నాదమ్మున..ప్రళయ వేదమ్మున
అర్ధ భాగానివీ..ఆది యోగానివీ
అర్ధ భాగానివీ..ఆది యోగానివీ
జగన్మోహినివీ..సిమ్హవాహినివీ
జగన్మోహినివీ..సిమ్హవాహినివీ
జగన్మోహినివీ..సిమ్హవాహినివీ

!!జననీ!!

చతుర్వేదమ్ములా..పంచ భూతమ్ములా
సర్వ మార్గమ్ములా..సప్త గీతమ్ములా
సర్వ మార్గమ్ములా..సప్త గీతమ్ములా
అష్ట యోగమ్ములా..నవ యాగమ్ములా
ముక్తి మార్గానివే..మంత్ర రూపానివే
ముక్తి మార్గానివే..మంత్ర రూపానివే
మోహనాశినివీ..మేరు వాసినివీ
మోహనాశినివీ..మేరు వాసినివీ
మోహనాశినివీ..మేరు వాసినివీ

!!జననీ!!

స్వర్ణ దేహమ్మునా..వర్ణమై విచ్చిన
లింగ రూపిణివే..మూగాంబికవే
లింగ రూపిణివే..మూగాంబికవే
స్వర్ణదేహమ్మునా..వర్ణమై విచ్చిన
లింగరూపిణివే..మూగాంబికవే
లింగరూపిణివే..మూగాంబికవే
సర్వ వేదమ్ములా..ధర్మ శాస్త్రమ్ములా
సత్య శోధనవే..సత్వ సాధనవే
సత్య శోధనవే..సత్వ సాధనవే
శక్తి పీఠమ్మువీ..ఆ..ఆ..
శక్తి పీఠమ్మువీ..సర్వ మోక్షమ్మువీ
శక్తి పీఠమ్మువీ..సర్వ మోక్షమ్మువీ
శక్తి పీఠమ్మువీ..సర్వ మోక్షమ్మువీ
శక్తి పీఠమ్మువీ..సర్వ మోక్షమ్మువీ 

!!జననీ!!

2 comments:

యేమిచ్చినా ఋణం తీర్చుకోలేని అమ్మకి మీ ట్రిబ్యూట్ చాలా బావుందండి.మీకూ బిలీటెడ్ విషెస్.

థాంక్స్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.