ఆదివారం, మే 04, 2014

నీలి మేఘమా అంత వేగమా...

విలేజ్ లో వినాయకుడు సినిమా కోసం కార్తీక్ పాడిన ఒక చక్కని పాట మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : విలేజ్ లో వినాయకుడు (2009)
సంగీతం : మణికాంత్ కద్రి
సాహిత్యం : వనమాలి
గానం : కార్తీక్

నీలి మేఘమా.. అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకీ రంగులు నీ వరమా
తూనీగా రెక్కలే పల్లకీగా.. 
ఊరేగే ఊహలే ఆపడం నా తరమా

నీలి మేఘమా.. అంత వేగమా
ఓ నిముషం ఆగుమా.. 
నేలకీ రంగులు నీ వరమా 

ప్రతీ మలుపులోనూ తనే కొలువయిందీ
ఒకో జ్ఞాపకన్నీ నాకే పంచుతోందీ
ఆ ఏటి గట్టూ అల పాదాలతోటీ .. 
ఈ గుండె గదిని తడి గురుతు చూపుతుందీ
ఆ నదులూ .. విరిసే పొదలూ .. 
నా ఎదకూ ఆమెనే చూపినవి

నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా.. 
నేలకీ రంగులు నీ వరమా

మదే కనని పాశం ఇలా ఎదురయిందా
తనే లోకమన్నా ప్రేమే నవ్వుకుందా
ఈ ఇంటిలోని అనుబంధాలు చూసీ.. 
నా కంటిపాపే కరిగింది ముచ్చటేసి 
ఈ జతలో.. ఒకడై ఒదిగే.. 
ఓ వరమే చాలదా ఎన్నటికీ

నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా.. 
నేలకీ రంగులు నీ వరమా 
 

4 comments:

Very beautiful song. Thanks for the post.

$

థాంక్స్ సిద్ గారు..

ఈ సాంగ్ మొదటి లైన్ చూస్తూనే.."నీలి మేఘమా-జాలి చూపుమా " అన్న అమ్మాయిల శపధం లో పాట ఫ్లాష్ లా గుర్తొచ్చేసింది వేణూజీ..వీలైతే ఆ పాట పోస్ట్ చేయగలరా..

మంచి పాట గుర్తు చేశారండీ, అలాగే తప్పకుండా పోస్ట్ చేస్తాను. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.