సోమవారం, మే 26, 2014

ఈ నల్లని రాలలో...

ఎస్.రాజేశ్వరరావు గారి మరో ఆణిముత్యం సినారె గారి రచనలో... మీరూ తనివితీరా ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమరశిల్పి జక్కన (1964)
సంగీతం : ఎస్ రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె 
గానం : ఘంటసాల

ఈ నల్లని రాలలో
ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటునా
ఏ గుండెలు మ్రోగెనో
ఈ నల్లని రాలలో

పాపాలకు తాపాలకు
బహుదూరములో నున్నవి
పాపాలకు తాపాలకు
బహుదూరములో నున్నవి
మునులవోలె కారడవుల
మూలలందు పడియున్నవి

ఈ నల్లని రాలలో

కదలలేవు మెదలలేవు
పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు 
పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనె
జలజలమని పొంగిపొరలు

ఈ నల్లని రాలలో

పైన కఠినమనిపించును
లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును
లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న
శిలలే నయమనిపించును

ఈ నల్లని రాలలో
ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటునా
ఏ గుండెలు మ్రోగెనో
ఈ నల్లని రాలలో 


2 comments:

ఈ పాట విన్నప్పుడల్లా "రాళ్ల లోపల పూలు పూసిన రామ మందిర లీల " అనే పాట గుర్తొస్తుంటుందండీ..మన చరిత్రకి మౌన సాక్ష్యాలు ఉలి చెక్కని శిలలే కదా..

ఓహ్ అవునా ఆ పాట ఎపుడూ వినలేదండీ.. థాంక్స్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.