రాజన్-నాగేంద్ర గారి స్వరకల్పనలో సినారే గారి రచన సింపుల్ అండ్ స్వీట్ సాంగ్ మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : అగ్గి పిడుగు (1964)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, జానకి
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో అది... నీకేమి ఏమి అయినది
ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది
హాయ్...
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
కనులలో నీ కనులలో.. నా కలలే పొంగినవీ
కురులలో ముంగురులలో.. నా కోరికలూగినవీ
ఆహ.. ఆహ... ఆ..
వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినదీ
చెంతగా నువు చేరగా గిలిగింతగ తోచినది.. గిలిగింతగ తోచినది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు
ఆహ.. ఒహో.. ఆ..
నవ్వుతో ముసినవ్వుతో హోయ్.. నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు.. మంత్రించివేయకు
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఆహ... ఆహ... ఆహ... అహ...
ఊహూహు.. హూ..హుహు..
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు
అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు
ఆహ.. ఒహో.. ఆ..
నవ్వుతో ముసినవ్వుతో హోయ్.. నను దోచివేయకు
మాటతో సయ్యాటతో నను మంత్రించివేయకు.. మంత్రించివేయకు
ఏమో ఏమో ఇది... నాకేమో ఏమో అయినది
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది
ఆహ... ఆహ... ఆహ... అహ...
ఊహూహు.. హూ..హుహు..
2 comments:
యన్.టి.ఆర్ ఇలా పాడితే, ఆయన కళ్ళలోని మెరుపు..నవ్వులోని మైమరపు చూసి వలచి వరించని వారెవ్వరు..
అంతే అంతేనండీ శాంతి గారు.. అందుకేగా మనం ఇప్పటికీ ఈ పాటని తలుచుకుంటున్నాం, చూసి మురిసిపోతున్నాం :-))
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.