బుధవారం, మే 21, 2014

నా హృదయంలో నిదురించే చెలీ...

ఎస్. రాజేశ్వరరావు గారి పాటలోని మాధుర్యం గురించి నేను చెప్పగలిగేటంతటి వాడనా అందులో ఈ పాట గురించి. చిన్న తనంలో మాస్ పాటలకు స్టెప్పులు వేసే రోజుల్లోనే ఎప్పుడైనా ఈ పాట రేడియోలో వినిపిస్తే మౌనంగా వినేసి చివర్లో అచ్చం ఈ హీరోయిన్ లాగానే చప్పట్లు కొట్టేసే వాళ్ళం. ఈ చక్కని పాటని మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ఆరాధన(1962)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల

నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై, వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
 
నా హృదయంలో నిదురించే చెలీ 
 
నీ కన్నులలోన దాగెనులే వెన్నెలసొనా
కన్నులలోనా దాగెనులే వెన్నెలసోనా
చకోరమై నిను వరించి
అనుసరించినావే కలవరించినావే 

 
నా హృదయంలో నిదురించే చెలీ  
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై, వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ 

నా గానములో నీవే
ప్రాణముగా పులకరించినావే
 
ప్రాణముగా పులకరించినావే 
పల్లవిగా పలుకరించ రావే 
పల్లవిగా పలుకరించ రావే 
నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి చాచి ఎదురు చూచినానే
నిదుర కాచినానే


నా హృదయంలో నిదురించే చెలీ  
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై, వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ 


2 comments:

"కుక్క పిల్ల , సబ్బు బిళ్ళ, తలుపు గొళ్ళెం, కాదేదీ కవితకనర్హం" అనే శ్రీశ్రీ గారి కలానికి రెండు వైపులా పదునే అనిపిస్తుందండీ ఈ పాట వింటే..

అవునండీ శ్రీశ్రీ గారు ఇలా అపుడపుడు ఆశ్చర్య పరస్తుండేవారనుకుంటా...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.