మంగళవారం, మే 06, 2014

అమ్మ అన్నదీ ఒక కమ్మని మాట

సత్యం గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక కమ్మనైన అమ్మ పాట నాకు ఇష్టమైనది మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : బాలు, సుశీల

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూట

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా ...మమతలమూట

దేవుడే లేడని మనిషున్నాడు
అమ్మేలేదను వాడు అసలే లేడు
దేవుడే లేడని మనిషున్నాడు
అమ్మేలేదను వాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా..మమతలమూట
 

అమ్మంటే అంతులేని సొమ్మురా
అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా
 
అమ్మ మనసు అమృతమేచిందురా
అమ్మ మనసు అమృతమేచిందురా
అమ్మ ఓడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా 

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా...మమతలమూట


అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే

అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట 

 

2 comments:

మనం యెంత పెద్ద వాళ్ళమైనా, చిన్న పిల్లల్లా అనిపించేది అమ్మకి మాత్రమే..ప్రతి క్షణం మన గురించి ఖంగారు పడుతుంటే విసుగొస్తుంది..కానీ వాళ్ళు వెళ్ళి పోయాకే తెలుస్తుంది..మనని పట్టించుకునే వాళ్ళేవరూ లేరనీ..మరలి రారనీ..

చాలా కరెక్ట్ గా చెప్పారు శాంతి గారు, ఉన్నపుడు తెలియదు కానీ వెళ్ళాకే విలువ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.