బుధవారం, మే 28, 2014

పువ్వై పుట్టి పూజే చేసి...

భారతీరాజా గారు తీసిన 'రాగమాలిక' సినిమా కోసం ఇళయరాజా గారు స్వరపరచిన మరో చక్కని పాట ఇది. వేటూరి గారి సాహిత్యం చాలా అందంగా ఉంటుంది ముఖ్యంగా మొదటి చరణం నాకు చాలా ఇష్టం. తమిళ్ వీడియో ఎంబెడ్ చేస్తున్నాను, తెలుగు ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : రాగమాలిక (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ


నీవే నాకు రాగం సాగనీవే హృదయ తాళం
గీతం నీకు హారం దేవి పాదం నాకు తీరం
దేవీ పూజ వేళ రాగమేలే పూల హారం
నాదం నాకు ప్రాణం చెరగరాదీ ఛైత్రమాసం
రేగే అగ్నిగుండం నన్ను తాకి పొందు శాంతం
నేనే నాదం...ఆ..ఆ..ఆ...

తనం ద నందం దం ద నందం దం ద
నందం దం ద నందం
నందం దం ద నందం దం ద
నందం దం ద నందం


నాదే సూర్య నేత్రం ఇంక నీదే చంద్రహాసం
నువ్వే చూడకుంటే నాకు లేదే సుప్రభాతం
రాగం వింత దాహం తీరకుంది తీపి మోహం
వీచే గాలిలోనే దాచుకున్నా నాదు గానం
లోకాలేడు నాలో ఆడి పాడే నాట్య వేదం
నీకే అంకితం...ఆ..ఆ..ఆ...

తనం ద నందం దం ద నందం దం ద
నందం దం ద నందం

పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
దం ద నందం దం ద నందం
దం ద నందం దం ద నం దం దం ద
 
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
నందం దం ద నందం దం ద
నందం దం ద నందం


4 comments:

ఇళయరాజా గారి బాణీ..బాలూ గారి వాణి..సింప్లీ సూపర్బ్..

అవునండీ సింప్లీ సూపర్బ్... థాంక్స్ ఫర్ ద కామెంట్ :-)

తనం ద నందం దం ద నందం దం ద
నందం దం ద నందం
నందం దం ద నందం దం ద
నందం దం ద నందం
..ఈ ఒక్క బిట్ చాలు..మనసుకి రెక్కలిచ్చి మరోలోకంలో విహరింపచేయటానికి. అద్భుతః..:) చాలా మంచి పాటను పంచుకున్నందుకు ధన్యవాదాలు. :)

కరెక్ట్ గా చెప్పారు శ్రీవల్లి గారు. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.