దేవీశ్రీప్రసాద్ పాటలలో సాథారణంగా బోలెడు ఎనర్జీ ఉన్నాకూడా తను అల్లూఅర్జున్ కోసం కంపోజ్ చేసేప్పుడు మాత్రం ఏదో ప్రత్యేకమైన ఎనర్జీని నింపుకుని కంపోజ్ చేస్తాడనిపిస్తుంది. వాళ్ళ కాంబినేషన్ లో మాస్ బీట్ అయినా క్లాస్ ఫీల్ ఉండే సాంగ్ అయినా చాలా అద్భుతంగా కలకాలం నిలిచిపోయే రేంజ్ కి వస్తుంది. అలాటిది వారిద్దరికి సుకుమార్ చిత్రీకరణ కూడా తోడైతే ఆ పాట ఎప్పుడు విన్నా చూసినా కొత్తగానే అనిపిస్తుంటుంది. వారి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాటని మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఆర్య (2004)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కేకే, కోరస్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కేకే, కోరస్
ఫీల్ మై లవ్....
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో కాదో
ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్...
ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్...
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో కాదో
ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్...
ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్...
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
హే నేనిచ్చే లేఖలన్నీ చించేస్తు ఫీల్ మై లవ్
నే పంపే పువ్వులనే విసిరేస్తు ఫీల్ మై లవ్
నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతు ఫీల్ మై లవ్
నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్
నా ఉనుకే నచ్చదంటు నా ఊహే రాదనీ
నేనంటే కిట్టదంటు నా మాటే చేదని
నా చెంతే చేరనంటు అంటూ అంటూ అనుకుంటూనే
ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్..
ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్..
నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్
ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్
ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్
విదిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్
వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైన ఒక్కసారి హృదయం అంటు నీకొకటుంటే
ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్...
నా ప్రేమను కోపంగానో..నా ప్రేమను కోపంగానో
ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్
విదిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్
వదిలేసి వెళుతూనే అడుగారా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైన ఒక్కసారి హృదయం అంటు నీకొకటుంటే
ఫీల్ మై లవ్... ఫీల్ మై లవ్...
నా ప్రేమను కోపంగానో..నా ప్రేమను కోపంగానో
నా ప్రేమను ద్వేషంగానో..నా ప్రేమను ద్వేషంగానో
నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో
నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్
నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్
మై లవ్.. మై లవ్.. మై లవ్..
2 comments:
ప్రేమ ఈక్వేషన్ ని చాలా డిఫరెంట్ గా చూపించిన సినిమా కదండీ..టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా కాన్సెప్ట్ ని ఒకే పాట లో నెరేట్ చేసిన సిరివెన్నెల గారికి రియల్లీ హేట్సాఫ్..
కరెక్ట్ అండీ... సిరివెన్నెల గారి కలం గొప్పతనమది. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.