పాట టైటిల్ చూడగానే దానికి అల్లుకున్న కొన్ని సీన్లు గుర్తొచ్చి గిలిగింతలు పెట్టి, ఆపై సినిమా గుర్తొచ్చి గుబులు పుట్టి, ఆపై అర్జంటుగా సినిమా చూడడం మొదలెట్టి ఉదయాన్నే చక్కబెట్టేద్దాం అనుకున్న పనులు పక్కనెట్టేసినందుకు మీ జీవిత భాగస్వామి చేతిలోనో అమ్మానాన్నల చేతిలోనో మొట్టికాయలు తింటే మాత్రం నా పూచీలేదండీ ముందే చెప్పేస్తున్నాను. ఎలాగూ మనలో కొంతమందికి శలవే కదా అని చెప్పి ఇపుడీ సినిమా గుర్తుచేసే పని పెట్టుకున్నాననమాట. ఈ కమ్మనైన పాట చూసీ వినీ కాసేపు మురిసి ముసి ముసి నవ్వులు నవ్వుకోవడం మాత్రం మరువకండేం :-) ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి.
చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల, బాలు
అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
ఓ... అసలే విరహం అయ్యో దూరం ఎల్లాగున్నావో
ఆ... చారెడు పిడికెడు బారెడు పిల్లా ఎల్లాగున్నావో
ఎందా??
చెంపకు కన్నులు చారెడు
సన్నని నడుము పిడికెడు
దువ్వీదువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జెడ బా...రెడూ
మనసిలాయో...
అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
ఆఆఅ..హా హా హా...
ఆఆఆఆ...
లా లా లా...
హా అయ్యో పావం ఆషాంద్ర కార్యం ఎందాయి..
అదేవిటి... ??
ఓ...గుటకలు చిటికెలు కిటుకులు అబ్బో చాలా గడుసూ
గుటకలు.. చిటికెలు.. కిటుకులు.. ఏమిటి సంగతి??
ఆ..కులుకు చూస్తే గుటకలు
సరసకు రమ్మని చిటికెలు
చక్కని చిన్నది అందం చందం చేజిక్కాలని కిటుకులూ
మనసిలాయో...
కిట్టమూర్తీ కిట్టమూర్తీ మనసిలాయో
మనసిలాయో మనసిలాయో ... అమ్ముకుట్టి
తత్తోం తగ తయ్యత్తోం సారిగ సారిరిస సారి
తత్తోం తగ తయ్యత్తోం సారిగ సారిరిస సారి
గసరిదమ పాదపమగరి నిగమప దపమగ పమగరి గరిసని
ఓణం వన్నే ఓణం వన్నే ఓణం వన్నే
తిరుఓణం వన్నే ఓణం వన్నే ఓణం వన్నే
గుండెల్లోన గుబగుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళూ
పరవశమైనా మా శ్రీవారికి పగ్గాల్లేనీ పరవళ్ళూ
చుట్టూ చూస్తే అందాలూ... లొట్టలు వేస్తూ మావారూ...
చుట్టూ చూస్తే అందాలూ... లొట్టలు వేస్తూ మావారూ...
అక్కడ తమకూ ఇక్కడ మనకూ విరహంలోనా వెక్కిళ్ళు
మనసిలాయో...
అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
అమ్ముకుట్టీ.. అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
5 comments:
మనసిలాయో - అంటే యేమిటి?
"మనసిలాయో?" అంటే "అర్ద్ధమయిందా?" అని అర్ద్ధం (మలయాళం).
హరి బాబు గారు, నరసింహారావు గారు చెప్పినట్లుగా "మనసిలాయో" అనేది మళయాళ పదం అండీ "అర్ధమయిందా?" అని అర్ధం. ఈ సినిమాలో హీరోయిన్ కొచ్చిన్(కేరళ) లో పని చేస్తుంటుంది కనుక హీరో గారితో అలా చమత్కారంగా మళయాళంలో అడిగించినట్లున్నారు.
నరసింహారావు గారు ధన్యవాదాలు.
అలిగినా, అలిసినా, కవ్వించినా, కలహించినా, వెయ్యిరెట్లయ్యే తెలుగమ్మాయి అందాన్ని కాప్చర్ చేయగలిగిన యేకైక భావ శిల్పి మన బాపు గారు..
బాపు గారి గురించి బాగా చెప్పారు శాంతి గారు, థాంక్స్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.