ఆదివారం, జనవరి 20, 2019

పద్మనాభ పాహి...

శుభలేఖ+లు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శుభలేఖ+లు (2018)
సంగీతం : కె.ఎమ్.రాథాకృష్ణన్
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : కె.ఎమ్.రాథాకృష్ణన్

పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ....
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ...

కోరుకున్న కల శిల్పమైన శిల
నిజమయ్యే నిమిషం
ఎదురు చూసినది ఎదను దాచినది  
ఎదురయ్యే సమయం
కోరుకున్న కల శిల్పమైన శిల
నిజమయ్యే నిమిషం
ఎదురు చూసినది ఎదను దాచినది  
ఎదురయ్యే సమయం
మనసు దేనికై పరుగు తీయునో
మదికి నెమ్మదిని ఎచట ఇచ్చునో
అది వెతికిన ప్రతి ఒకరికి దొరికేనా
ఏమో...

పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ...

ప్రేమతోన పెనవేసుకున్న
ప్రతి పయనం అతి మధురం
మాట మాట కలిపేసుకుంటె
మధువొలికిన రుతు పవనం
ప్రేమతోన పెనవేసుకున్న
ప్రతి పయనం అతి మధురం
మాట మాట కలిపేసుకుంటె
మధువొలికిన రుతు పవనం
నిన్ను నిన్నుగా ఏది ఉంచునో
నిన్ను రేపులతొ ఊరడించునో
ఆ చెలిమిని మరువకు మరి ఏనాడైనా
తోడే...

పద్మనాభ పాహి
పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ
గుణవశన శౌరీ... శౌరీ... శౌరీ..
 

2 comments:

రాధకృష్ణ గారి గొంతులో కర్ణాటక సంగీతం మృదువుగా జాలువారడమే తెలుసు..కొత్తగా..వాయస్ లో చిన్న రఫ్ యెడ్జ్ తో చాలా బావుందీ పాట..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.