సోమవారం, జనవరి 21, 2019

దూరాలే కొంచెం కొంచెం...

ఇదంజగత్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఇదం జగత్ (2018)
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సాహిత్యం : కృష్ణకాంత్
గానం : రవిప్రకాష్, యామిని

నిసనిస.. పనిసా..
నిసనిస.. పనిసా..

దూరాలే కొంచెం కొంచెం
దూరాలే అవుతున్నట్లు
దారాలే అల్లేస్తున్నా స్నేహాలేవో
గారాలే కొంచెం కొంచెం
నీమీదే వాలేటట్టు
గాలేదో మళ్ళిస్తున్న ఇష్టాలేవో
కనులే ఇలా కసిరేంతలా
కలవాలనే కలలే ఇవా
అలవోకగా అలవాటులూ
అనుకోనిదే అవుతోందిలా

మౌనంగా దాగే ప్రేమా
మెల్లంగా మాటల్నే మార్చేస్తుందా
ఆవైపూ ఇంతే ఉన్నా
వద్దంటూ మోమాటం పెట్టేస్తుందా

కొంగొత్తగా మెదిలే ఓ వెలుగే
నీవల్లనే కలిగే
నువ్వుండంగా దిగులే ఉండదులే
నవ్వుల్లో నే మునిగే
ఇంతలా తెలిశావనే
గమనించనైనా లేదులే

గడియారమే పరుగాపదే
గడిచేనులే ఘడియే ఇలా
నిను చూడగా సరిపోదుగా
ఏ మరి మరి కోరే ప్రణయమా
కలవాలనీ కదిలే ఇలా
కలిసిందిలే కల నేరుగా
కనుకే ఇలా కథ మారెగా
కలిపిందిలే కాలం కదా


మౌనంగా దాగే ప్రేమా
మెల్లంగా మాటల్నే మార్చేస్తుందా
ఆవైపూ ఇంతే ఉన్నా
వద్దంటూ మోమాటం పెట్టేస్తుందా 

 

2 comments:

ఈ మధ్య వస్తున్న కొత్త సినిమాల్లో కొన్నైనా పాటలు మెలోడియస్ గా ఉండడం బావుంది..

ఎగ్రీ శాంతిగారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.