ప్రేమ కథా చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ప్రేమ కథా చిత్రం 2 (2019)
సంగీతం : జె.బి.(జీవన్ బాబు)
సాహిత్యం : అనంత శ్రీరం
గానం : రాహుల్ శిప్లిగంజ్, రమ్య బెహరా
మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా
ఉరుములా ఉరిమిన తొలి ఆశా
వరదలా ఉన్నది వరస
చిలిపి కౌగిలై చేరుకోనా
వలపు ఊపిరై ఉండిపోనా
పెదవి కొమ్మపై వాలిపోనా
మొదటి ప్రేమనై మళ్ళీ పూయనా
ఓఓఓఓఓఓఓ....ఓఓఓఓఓఓ...
మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా
రేయిలా తొలి రేయిలా
గడుపుదాం జీవితం
మరపుకీ మైమరపుకీ
పలుకుదాం స్వాగతం
నేను నీలో అలా
నువ్వు నాలో ఇలా
ఇదేలా... ఓఓఓఓఓ..
ఓఓఓఓఓఓఓ..
మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా
నేలకి చిరుగాలికీ
నడుమ నుండే క్షణం
వెలుగుకి మరి మసకకీ
ముడులు వేద్దాం మనం
నేను నువ్వవ్వగా
నువ్వు నేనవ్వగా..
ఇలాగా... ఓఓఓఓఓఓ..
ఓఓఓఓఓఓ...
మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసుని తడిపెయ్ వా
2 comments:
ఇదీ హారర్ మూవీ యే కదా..
అవునండీ.. హార్రరే.. మొదటి దానికన్నా ఎక్కువ భయపెడదామని ట్రై చేస్తున్నట్లుంది టీజర్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.