అందరికీ కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పూజలందుకునే పశువులను గురించిన ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కొండపల్లి రాజా (1993)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : ?? వేటూరి / భువనచంద్ర
గానం : బాలు
కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా
పశువంటె మనిషికి అలుసు
మనసున్న నీకది తెలుసు
అ ఆ ఇ ఈ రానె రాదు
అయినా మాయా మర్మం లేదు
కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా
కన్నతల్లిలా పాలనిచ్చి ప్రాణం పోసే
త్యాగం ఉన్న గొప్ప జాతి నీది
సొమ్ము చూపిస్తే గొంతు కోసి రంకెలేసే
జాలిలేని పాడు లోకం మాది తెలుసా బసవన్న
నీకైనా యెందుకు ఇంతటి భేదం
క్షణమే బతుకన్న ఓ బసవన్న
మనిషికి లేదురా పాశం
కాటికెళ్ళినా కాసు వీడడు
సాటివాడిపై జాలి చూపడు
డబ్బును మేసే మనుషులు కన్న
గడ్డిని మేసే నువ్వె మిన్న
కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా
మబ్బు డొంకల్లో దూసుకెళ్ళే పక్షిని చూసి
కూర్చినాడు మనిషి విమానం
వాగు వంకల్లో ఈదుకెళ్ళే చేపని చూసి
నేర్చినాడు పడవ ప్రయాణం
దివికి భువికి ముచ్చటగా
నిచ్చెన వేసిన మనిషి
చెలిమి కలిమి నలుగురికి
ఎందుకు పంచడు తెలిసీ
తరిగి పోనిది ప్రేమ ఒక్కటే
తిరిగి రానిది ప్రాణమొక్కటే
ప్రాణం కన్నా స్నేహం మిన్న
స్నేహం లేని బతుకే సున్నా
కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా
పశువంటె మనిషికి అలుసు
మనసున్న నీకది తెలుసు
అ ఆ ఇ ఈ రానె రాదు
అయినా మాయా మర్మం లేదు
కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా
2 comments:
కనుమ శుభాకాంక్షలు..
థాంక్స్ శాంతి గారు మీకు కూడా కనుమ శుభాకాంక్శలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.