శుక్రవారం, జనవరి 18, 2019

రాజర్షి...

నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్-మహానాయకుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహానాయకుడు (2018)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : శంకరాచార్య నిర్వాణ షట్కము,
కె.శివదత్త, కె.రామకృష్ణ, కీరవాణి
గానం : శరత్ సంతోష్, మోహన భోగరాజు,
కీరవాణి, కాలభైరవ, శ్రీనిధి తిరుమల

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ..

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దుఃఖం
చిదానంద రూపః
శివోహం శివోహం..

తల్లి ఏదీ? తండ్రి ఏడీ?
అడ్డుతగిలే బంధమేదీ?
మమతలేవీ? మాయలేవీ?
మనసు పొరల మసకలేవీ?

నీ ఇల్లు నీ వాళ్లు
నీదంటు ఏ చింత
సుంతైన లేని ఈ నేలపై
నడయాడు ఋషివో..

కృషితో నాస్తి దుర్భిక్షమని
లోకాన్ని శాసించు మనిషివో..
ఋషివో.. రాజర్షివో..
ఎవరివో.. నీవెవరివో..
నీవెవరివో.. ఎవరివో..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞాః న వేదం
న ధర్మో న చార్ధో
న మోక్షః న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానంద రూపః
శివోహం శివోహం

జాగృతములో జాగు ఏదీ?
రాత్రి ఏదీ? పగలు ఏదీ?
కార్యదీక్షా బద్ధుడవుగా..
అలుపు ఏదీ? దిగులు ఏదీ?

ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని
ఉర్వీజనోద్ధరణకై చేయు రాజయోగీ

కదనరంగాన కర్మయోగీ..

అహం నిర్వకల్పో
నిరాకార రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణామ్

నతేజో నవాయుర్న
భూమిర్న వ్యోమం
చిదానంద రూపః
శివోహం శివోహం..

నిర్వసన, వాసాన్న సంక్షేమ స్వాప్నికుడు ఇతడు
నిష్క్రియాప్రచ్ఛన్న సంగ్రామ శ్రామికుడు ఇతడు
నిరత సంఘశ్రేయ సంధాన భావుకుడు ఇతడు
మహా నాయకుడు ఇతడు...
మహా నాయకుడు ఇతడు...

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ..

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దుఃఖం
చిదానంద రూపః
శివోహం శివోహం..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞాః న వేదం
న ధర్మో న చార్ధో
న మోక్షః న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానంద రూపః
శివోహం శివోహం

అహం నిర్వకల్పో
నిరాకార రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణామ్

నతేజో నవాయుర్న
భూమిర్న వ్యోమం
చిదానంద రూపః
శివోహం శివోహం..


2 comments:

కీరవాణిగారు..జయహొ జయహొ..

థాంక్స్ శాంతి గారు.. నేనూ మీతో గొంతు కలిపి జయహో జయహో.. :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.