మంగళవారం, జనవరి 29, 2019

సమర శంఖం...

యాత్ర చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : యాత్ర (2018)
సంగీతం : కె.కృష్ణ కుమార్ 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కాలభైరవ

నీ కనులలో కొలిమై
రగిలే కలేదో
నిజమై తెలవారనీ
వెతికే వెలుగై రానీ

ఈ నాటి ఈ సుప్రభాత గీతం
నీకిదే అన్నదీ స్వాగతం
ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం
చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం

ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది
అంతరంగమే కదనరంగమైనదీ
ప్రాణమే బాణమల్లె తరుముతున్నది
నిన్ను నీవే జయించిరార
రాజశేఖరా అంటున్నదీ

మనసులో మండుటెంటలాగా
నిప్పులే చెరగనీ నిశ్చయం
నీ గుండెలో మంచుకొండలాగా
నిత్యమూ నిలవనీ నమ్మకం

వసుధకే వందనం చెయ్యకుండా
నింగిపైకి ఎగురుతుంద గెలుపు జండా
ఆశయం నెత్తురై పొంగకుండా
శ్వాసలోని సమర శంఖమాగుతుందా

ఈ నాటి ఈ సుప్రభాత గీతం
నీకిదే అన్నదీ స్వాగతం
ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం
చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం

ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది
అంతరంగమే కదనరంగమైనదీ
ప్రాణమే బాణమల్లె తరుముతున్నది
నిన్ను నీవే జయించిరార
రాజశేఖరా అంటున్నదీ

మనసులో మండుటెంటలాగా
నిప్పులే చెరగనీ నిశ్చయం
నీ గుండెలో మంచుకొండలాగా
నిత్యమూ నిలవనీ నమ్మకం

వసుధకే వందనం చెయ్యకుండా
నింగిపైకి ఎగురుతుంద గెలుపు జండా
ఆశయం నెత్తురై పొంగకుండా
శ్వాసలోని సమర శంఖమాగుతుందా 


2 comments:

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.