మంగళవారం, జనవరి 01, 2019

మేలుకోరా తెలవారెను...

మిత్రులందరకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు గృహలక్ష్మి చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : గృహలక్ష్మి (1985)
సంగీతం : చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల

మేలుకోర తెల్లవారెను కృష్ణయ్యా  
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా


నీ ముద్దు మోమును చూడాలి
మా పొద్దు అప్పుడే పొడవాలి
నీ నవ్వే వెలుగై నిండాలి..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య
మా మేలుచూసే చల్లని దైవం నీవయ్యా


నీవిచ్చిన సౌభాగ్యం..దీవించిన సంసారం
నీ నీడన నిలకడగా..నిలవాలి..ఈ
నీవిచ్చిన సౌభాగ్యం..దీవించిన సంసారం
నీ నీడన నిలకడగా..నిలవాలి
నెలవంక వెన్నెలగా..పెరగాలి
నిన్ను నమ్మి ఉన్నాము..కృష్ణా..ఆ

మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా


దేవకి వసుదేవులు..రేపల్లె పౌరులు
నీకోసమే ఎదురుచూస్తూ..ఉన్నారు
దేవకి వసుదేవులు..రేపల్లె పౌరులు
నీకోసమే ఎదురుచూస్తూ..ఉన్నారు
సరసాలకు ఇది సమయం..కాదురా..ఆ
సందె వేళదాకైనా ఆగర..కృష్ణా..ఆ

మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా


నీధర్మం నెరవేర్చు..అది జన్మలు కడతేర్చు
అని నీవే అన్నావు..ఆ దారినె పోనివ్వు
మంచైనా చేడునైన..భరియించే బలమివ్వు..కృష్ణా..ఆ
మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా

నీ ముద్దు మోమును చూడాలి
మా పొద్దు అప్పుడే పొడవాలి
నీ నవ్వే వెలుగై నిండాలి..కృష్ణా..ఆ

మేలుకోరా తెలవారెను..కృష్ణయ్య
మా మేలుచూసే..చల్లని దైవం నీవయ్యా  

 

2 comments:

హాపీ న్యూ యియర్ అండి..

థాంక్స్ శాంతి గారు.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.