ఆదివారం, జనవరి 27, 2019

ఆశా పాశం బందీ సేసేలే...

కేరాఫ్ కంచరపాలెం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కేరాఫ్ కంచరపాలెం (2018)
సంగీతం : స్వీకార్ అగస్తి
సాహిత్యం : విశ్వ
గానం : అనురాగ్ కులకర్ణి 

ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో

సేరువైనా సేదూ దూరాలే
తోడౌతూనే ఈడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో
ఆటు పోటు గుండె
మాటుల్లోనా... సాగేనా...

ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో ఏనీల్లో ఎద కొలనుల్లో

నిండు పున్నమేళ
మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లిపోతుంటే
నీ గమ్యం గందరగోళం
దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు
పల్లటిల్లిపోయి నీవుంటే
తీరేనా నీ ఆరాటం
ఏ హేతువు నుదుటి
రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే..
నీ ఉనికి ఉండాలిగా..

ఓ... ఆటు పోటు గుండె
మాటుల్లోన... సాగేనా...

ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో


ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడలా విధి వేచున్నదో
ఏ ముడుపులో ఏం దాగున్నదో
నీవుగా తేల్చుకో నీ శైలిలో


సిక్కు ముళ్ళు గప్పి
రంగులీనుతున్న
లోకమంటె పెద్ద నాటకమే
తెలియకనే సాగే కధనం.
నీవు పెట్టుకున్న
నమ్మకాలు అన్ని
పక్కదారి బట్టి పోతుంటే
కంచికి నీ కధలే దూరం
నీ సేతుల్లో ఉంది
సేతల్లో సూపించి
ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే
నువ్వెదురు సూడాలిగా

ఓ... ఆటు పోటు గుండె
మాటుల్లోన... ఉంటున్నా...

 

4 comments:

ప్చ్..ఈ మూవీ చూడలేకపోయాము..టీవీ లో యెప్పుడొస్తుందా అని వైటింగ్..

మంచి సినిమా అండీ.. టీవీలో వచ్చే ముందే ప్రస్తుతం ఈ సినిమాని జియో సినిమా వెబ్ సైట్ లో చూడచ్చండి. జియో ఫోన్ నంబర్/ఐడి ఉంటే చాలనుకుంటాను మూవీ లింక్ ఇది కేరాఫ్ కంచరపాలెం

Very very very highly impressed and touched like any thing

థాంక్స్ ఫర్ ద కామెంట్ అనానిమస్ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.