బుధవారం, జనవరి 02, 2019

రామా చిలకమ్మా...

చూడాలని ఉంది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం :  చూడాలనివుంది (1998)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం :  వేటూరి
గానం : ఉదిత్ నారాయణ్, స్వర్ణలత

రామా చిలకమ్మా
ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా
ప్రేమా మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న
నీళ్ళే నలుపన్న గోపెమ్మా

ముక్కు మీద తీపి కోపాలా
మూగకళ్ళ తేనె దీపాలా
గంగూలి సందులో గజ్జెల గోల
బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడేక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగుదురా మేఘమాల

రామా చిలకమ్మా
ప్రేమా మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న
నీళ్ళే నలుపన్న గోపెమ్మా

గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో
కృష్ణయ్యో పూవ్వే నాదీ పూజే నీదయ్యో

దొంగలించుకున్న సొత్తు గోవిందా
ఆవలించకుంటె నిద్దరౌతుందా
ఉట్టికొట్టే వేళ రైకమ్మో
చట్టీ దాచిపెట్టూ కోకమ్మో
కృష్ణమురారీ వాయిస్తావో
చలి కోలాటమేదో ఆడిస్తావో


రామా చిలకమ్మా
ప్రేమా మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న
నీళ్ళే నలుపన్న గోపెమ్మా

ఓలమ్మో చోళిలోన షోకు గోలమ్మో
ఓయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో
వేణువంటే వెర్రిగాలి పాటేలే
అది వెన్నదోచుకున్న వెన్ను చాటేలే
జట్టేకడితే జంట రావమ్మో
పట్టువిడుపు ఉంటే మేలమ్మో
ప్రేమాడే కృష్ణుడు కన్నుకొట్టాల
పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాల


రామా చిలకమ్మా
ప్రేమా మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న
నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ముక్కు మీద తీపి కోపాలా
మూగకళ్ళ తేనె దీపాలా

గంగూలి సందులో గజ్జెల గోల
బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడేక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాల 

2 comments:

యెవ్వర్ గ్రీన్ సాంగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.