బుధవారం, జనవరి 23, 2019

ఎంతో ఫన్...

పూర్తి కామెడీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టచ్చని మరోసారి నిరూపించిన ఎఫ్ టూ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడె చేసిన ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట లిరికల్ వీడియో ఇక్కడ.


చిత్రం : F2 (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీశ్రీప్రసాద్

స్వర్గమే నేలపై వాలినట్టు
నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు
గుండెలోన పూలవాన కురిసినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్

నెమలికే పాటలే నేర్పినట్టు
కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు
కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్

కాళిదాసు కావ్యము
త్యాగరాయ గేయము
కలిపి మనసు పాడినట్టుగా
అందమైన ఊహలు
అంతులేని ఆశలు
వాకిలంత వొంపినట్టుగా
ఎంతో ఫన్ ఎంతో ఫన్

కళ్ళు కళ్ళూ కలుపుకుంటూ
కలలు కలలూ పంచుకుంటూ
కాలమంతా సాగిపోనీ
మోహమంతా కరిగిపోతూ
విరహమంతా విరిగిపోతూ
దూరమంతా చెరిగిపోనీ
రాతిరంటె కమ్మనైన
కౌగిలింత పిలుపనీ
తెల్లవార్లు మేలుకోవడం
ఉదయమంటె తియ్యనైన
ముద్దు మేలుకొలుపనీ
దొంగలాగ నిద్రపోవడం

ఎంతో ఫన్ ఎంతో ఫన్

రోజుకొక్క బొట్టుబిళ్ళే
లెక్కపెడుతూ చిలిపి అద్దం
కొంటె నవ్వే నవ్వుతోందే
బైటికెళ్ళే వేళ నువ్వే
పిలిచి ఇచ్చే వలపు ముద్దే
ఆయువేదో పెంచుతోందే
ఇంటికెళ్ళె వేళ అంటు
మల్లెపూల పరిమళం
మత్తుజల్లి గుర్తుచేయడం
ఇంటి బయిట చిన్నదాని
ఎదురుచూపు కళ్ళలో
కొత్త ఉత్సవాన్ని నింపడం

ఎంతో ఫన్ ఎంతో ఫన్ 

 

2 comments:

హిలేరియస్ మూవీ..బ్యూటిఫుల్ సాంగ్..

అవునండీ.. నాకు కూడా చాలా నచ్చింది రెండున్నరగంటలు హాయిగా నవ్వుకుని రావచ్చు. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.