సోమవారం, జనవరి 28, 2019

నువు రాముడేషమే...

కథానాయకుడు చిత్రంకోసం కీరవాణి కంపోజ్ చేసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కథానాయకుడు (2018)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : కాలభైరవ, పృథ్వీచంద్ర

ఎన్టీఆర్... ఎన్టీఆర్... ఎన్టీఆర్...
నువు రాముడేషమే కట్టావంటే
గుండెలు అన్నీ గుడులైపోతాయే హో..
నువు కృష్ణుడై తెరమీదకు వస్తే
వెన్నముద్దలై కరిగెను హృదయాలే హో..
ఆ దేవుడు దేవుడు ఎదురుగ
వచ్చిన దేవుడు కాదంటాం
ఎందుకనీ అడిగాడో
ఎన్టీఆర్ పోలిక ఒకటీ లేదంటాం..

తెల్లారగట్ల లేచిపోయి
చద్ది కూడు పట్టుకుని   
ఎడ్లబళ్ళు కట్టుకుని వచ్చేశాం
మేం చొక్కాలెన్నో చింపుకున్నాం
గొంతులన్నీ చించుకున్నాం
తనివి తీరనిది నీపై అభిమానం

నువ్వందుకున్న ఘనతని చదివితే
ముచ్చెమటలు పట్టవ చరితకే
ఆ గెలుపను నింగికి నువ్విక చందమామే
ఎవ్వడికీ రాదులేరా నీలో ఎంత రాజసంరా
కనిపిస్తే గత్తర గత్తర నేలా బెంచీల్లో
ఈలలు గొట్టీ ఊళలు గొట్తి
రచ్చలు రేపే రంగుల జాతర ఎన్టీఆర్..

నీ వాల్ పోస్టరు.. హోలీ రంజాన్ ఈస్టర్
గుండీలు తీసుకుంటు కాలర్ ఎత్తి కేకలు కేకలు
ఎవ్వరు చేసిన పుణ్యమొ పుట్టేశావు
భూమికి వైభోగాన్ని తెచ్చావు
శతాబ్దమంతా ఏలుకోరా.. ఎన్టీఆర్..

ఒక రాగమెత్తి నువు పద్యం పాడితె
రాసినోడి చెయ్యి దండం పెడుతుందే హో..
ఆ తేనెలొలుకు నీ మాటలు వింటే
తెలుగు భాష తెగ సంబరపడుతుందే హో..
నువ్వెయ్యని చెయ్యని పాత్రలు గానీ
మిగిలున్నాయంటే ధైర్యంగా చెప్పగలం
ఆ పాత్రలకంతటి ప్రాప్తం లేదంతే

నీ బొమ్మలున్న పత్రికల్ని
పుస్తకాలకట్టలేసి మురిసిపోయి
హీరోల్లాగ ఫోజిస్తాం
మా కళ్ళల్లోన పెట్టుకున్నాం
పచ్చ బొట్టు ఏసుకున్నాం
వెండి తెరకు నువు మేలిమి బంగారం

నిన్నింతకన్న ఇంతకన్న పొగిడితే
మా దిష్టి తగిలి నీకేమన్న జరిగితే
నిను ఊపిరిగ చేసుకున్న మనసులు తట్టుకోవే

వచ్చిందని కొత్తనీరు పొంగింది నిమ్మకూరు
పరుగో పరుగో పరుగో పరుగెత్తిపోయింది పాతనీరు
ఇక ఎవడూ ఎవడూ ఎవదూ ఎదురే లేడు
ఎండనక వాననకా పగలనక రేయనకా
ఒకటే చప్పుడు ఎన్టీఆర్

బుకింగ్ కౌంటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డు
బద్దలవుద్ది చూడు బాక్సాఫీసు దుమ్ము
దులుపు దులుపు దులుపు ఎన్టీఆర్.. 
 

2 comments:

ఈ పాట యెప్పుడు విన్నా గూస్ బంప్స్..జయహో భాస్కరభట్లగారు, భైరవ, కీరవాణిగారు....

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు... నిజమేనండీ ఎన్ని జయహోలు కొట్టినా చాలవు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.