గురువారం, జనవరి 03, 2019

నలుపైనా కన్నయ్య...

భరణి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భరణి (2007)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : రోషిణి, రంజిత్

నలుపైనా కన్నయ్య చెయ్యి పడితే
యదలో నా యదలో పువ్వు పూసెనమ్మా
నలుపైనా కన్నయ్య చెయ్యి పడితే
యదలో నా యదలో పువ్వు పూసెనమ్మా
మనసులోన మదన జ్వరం రేగెనమ్మా
పరువాల చలిరాగం పలికెనమ్మా
వాడి కత్తి చూపు మెత్తగ నను గుచ్చేనమ్మా

సిరిమల్లై నవ్విందే కొంటెభామా
సిరులు ఆ సిరులు యద దోచెనమ్మా
అదిరిపడే సొగసులలో వచ్చేనమ్మా
మంచులాంటి సెగలేవో తెచ్చెనమ్మా
ఈ చెలిచూపే గుండెల్లో నాటేనమ్మా

నలుపైనా కన్నయ్య చెయ్యి పడితే
యదలో నా యదలో పువ్వు పూసెనమ్మా

కన్నుకలిపి మనసుపడిన కన్నెపిల్లరా
ఈ లేత అందం తీర్చమంది తేనెదాహమే
ఇన్నినాళ్ళు నాకు ఏ గండం లేదులే
ఒక కన్నెవల్లా గండముందని తెలియలేదులే
గంటకొట్టూ ప్రేముంది జంటకట్టవోయ్
సొగసు సాగరాన ముత్యముంది ఒడిసిపట్టవోయ్

సిరిమల్లై... నవ్విందే.. సిరిమల్లై.. 
సిరిమల్లై నవ్విందే కొంటెభామా
సిరులు ఆ సిరులు యద దోచెనమ్మా

వెచ్చనైన చిలిపి ముద్దు పెదవి కోరెనే
అది తాకపోతె కరెంట్ లాగ షాకు కొట్టెనే
అగ్గిపుల్ల చూపులున్న కళ్ళు నీవిరో
ఆ చూపు సోకి మండుతున్న మనసు నాదిరో
భూమిలోన ఎన్నెన్నో పువ్వులున్నాయి
ఆ పువ్వులన్నీ పాడేనంటా లవ్వు సన్నాయి
అమ్మో.. అయ్యో.. ఆహా..

అరెరె నలుపైనా కన్నయ్య చెయ్యి పడితే
యదలో నా యదలో పువ్వు పూసెనమ్మా
మనసులోన మదన జ్వరం రేగెనమ్మా
పరువాల చలిరాగం పలికెనమ్మా
ఈ చెలిచూపే గుండెల్లో నాటేనమ్మా

నలుపైనా కన్నయ్య చెయ్యి పడితే
యదలో నా యదలో పువ్వు పూసెనమ్మా
పువ్వు పూసెనమ్మా.. తననాననన్నా.. 

 

2 comments:

కన్నయ్య మాస్ పాటా..

హహహ అంతే కదండీ మరి :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతిగారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.