శుక్రవారం, జనవరి 11, 2019

ధీరసమీరే యమునా తీరే...

ధర్మచక్రం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ధర్మచక్రం (1996)
సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ
సాహిత్యం : వేటూరి,
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

ధీరసమీరే యమునా తీరే
వసతివనే వనమాలీ

గ్రామసమీపే ప్రేమకలాపే
చెలి తగునా రసకేళీ
ఆకాశమే నా హద్దుగా
నీకోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా
గిచ్చేయి నచ్చిన సొగసులు


ధీరసమీరే యమునా తీరే
వసతివనే వనమాలీ

గ్రామసమీపే ప్రేమకలాపే
చెలి తగునా రసకేళీ

వేసంగి మల్లెల్లో సీతంగి వెన్నెల్లో
వేసారిపోతున్నారా రారా

హేమంత మంచుల్లో ఏకాంత మంచంలో
వేటాడుకుంటున్నానే నిన్నే
మొటిమ రగులు సెగలో
తిరగబడి మడమ తగులు వగలో

చిగురు వణుకు చలిలో
మదనుడికి పొగరు పెరిగె పొదలో
గోరింట పొద్దుల్లోన పేరంటాలే ఆడే వేళ

ధీరసమీరే యమునా తీరే
వలచితి నే వనమాలీ
గ్రామసమీపే ప్రేమకలాపే
ప్రియ తగునా రసకేళీ


లేలేత నీ అందం నా గీత గోవిందం
నా రాధ నీవే లేవే రావే
నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు
నా ఉట్టి కొట్టేస్తున్నా రామా

వయసు తెలిసె ఒడిలో
ఎద కరిగి తపన పెరుగు తడిలో
మనువు కుదిరె మదిలో
ఇంకెపుడు చనువు ముదురు గదిలో

వాలారు సందెల్లోన
వయ్యారాలే తాకే వేళ

ధీరసమీరే యమునా తీరే
వలచితి నే వనమాలీ
 ఆఆఅ గ్రామసమీపే ప్రేమకలాపే
ప్రియ తగునా రసకేళీ

ఆకాశమే నా హద్దుగా
నీకోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా
గిచ్చేయి నచ్చిన సొగసులు


ధీరసమీరే యమునా తీరే
వసతివనే వనమాలీ

గ్రామసమీపే ప్రేమకలాపే
చెలి తగునా రసకేళీ

 

2 comments:

ఇంత కమర్షియల్ మూవీ లో యెంతో మెలోడియస్ సాంగ్..

అవునండీ.. అప్పట్లో సూపర్ హిట్ కూడా కదా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.