శనివారం, జనవరి 12, 2019

నల్లని వాడా...

రావు బాలసరస్వతి గారు గానం చేసిన ఒక చక్కని లలిత గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లలిత గీతం
సంగీతం :
సాహిత్యం : వింజమూరి శివరామారావు
గానం : రావు బాల సరస్వతి

నల్లని వాడా.. నే గొల్ల కన్నెనోయ్
పిల్లన గ్రోవూదుమూ.. నా యుల్లము రంజిల్లగా
నల్లని వాడా.. నే గొల్ల కన్నెనోయ్
పిల్లన గ్రోవూదుమూ..నా యుల్లము రంజిల్లగా

నల్లని వాడా..ఆఆఆ...

నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగ వచ్చితినే
నా మనసూ తనువూ.. నా మనికే నీది కదా

పిల్లన గ్రోవూదుమూ...
నల్లని వాడా..ఆఆఆ...


ఆకశానా మబ్బులనీ చీకటులే మూగెననీ
నేనెరుoగ నైతిని నీ తలపే వెలుంగాయె

పిల్లన గ్రోవూదుమూ...
నల్లని వాడా..ఆఆఆ...


మెరుపే నీ దూతికయై వలపే నా నెచ్చెలి యై
తోడితెచ్చె నీ దరికీనాడు పండే నా నోములూ

పిల్లన గ్రోవూదుమూ...
నల్లని వాడా..నే గొల్ల కన్నెనోయ్
పిల్లన గ్రోవూదుమూ..నా యుల్లము రంజిల్లగా
నల్లని వాడా..ఆఆఆ... 

2 comments:

యేంతో బావుంటుందీ పాట..మరోసారి గుర్తుచేసినందుకు థాంక్సండీ..

అవునండీ వింటూంటే ఏదో తెలియని ప్రశాంతత హాయైన ఫీలింగ్ కలుగుతుంటుంది. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.