బుధవారం, జనవరి 09, 2019

నల్లనివాడే చల్లనివాడే...

పెళ్ళిసందడి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళిసందడి (1959)
సంగీతం : ఘంటసాల   
సాహిత్యం : సముద్రాల జూ.
గానం : పి.లీల, కె.రాణి   

నల్లనివాడే చల్లనివాడే
పిల్లనగ్రోవీ గోపాలుడే
రేపల్లెకు వెలుగే గోపాలుడే

చల్లలనమ్మే పిల్లలనాపే
అల్లరిచిల్లరి గోపాలుడే
కడుపల్లదనాల గోపాలుడే

గోవర్థనగిరి గోటను నిలిపీ
గోవుల కాచినవాడే
కాళియనాగును కాలనురాచీ
కాచిన మగసిరివాడే

జలకములాడే గోపీజనులా
వలువలు దోచినవాడే
ఒంటరి పడుచుల పైటలులాగే
తులిపే తుంటరివాడే

బృందావని నీ ఆనందముతో
మైమరపించిన గోవిందుడే
మైమరపించిన గోవిందుడే

చల్లలనమ్మే పిల్లలనాపే
అల్లరిచిల్లరి గోపాలుడే
కడుపల్లదనాల గోపాలుడే

మోహన మురళీ గానముతో
హాయిని గొలిపే వాడే
అందెల చిందుల సందడితో
మది తొందర పరిచే వాడే
చిన్నగ చేరీ పాలూ పెరుగూ
వెన్నలు దోచేవాడే
వన్నెలు చేసీ కన్నెల వలపూ
మిన్నగ దోచేవాడే

మాయా పూతన మాయా కంసుని
హతమార్చిన మొనగాడే
మధురానగరికి మాతామహునీ
రాజును చేసినవాడే
అందరివాడే సుందరుడే
మన నందకిశోరుడు గోవిందుడే
మన నందకిశోరుడు గోవిందుడే

నల్లనివాడే చల్లనివాడే
పిల్లనగ్రోవీ గోపాలుడే
రేపల్లెకు వెలుగే గోపాలుడే

ఓఓఓఓఓ...హో.హో...

నల్లనివాడే చల్లనివాడే
పిల్లనగ్రోవీ గోపాలుడే
రేపల్లెకు వెలుగే గోపాలుడే

 

2 comments:

ఈ మూవీలో "చమక్ చమక్ తారా" పాట కూడా చాలా బావుంటుంది..

అవునా.. అది కూడా ప్రచురించడానికి ప్రయత్నిస్తానండీ..థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.