మంగళవారం, జనవరి 22, 2019

నీలో నాలో ఊపిరి అమ్మరా...

లిటిల్ హార్ట్స్ చిత్రం లో అమ్మ గురించి కూర్చిన ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లిటిల్ హార్ట్స్ (2001)
సంగీతం : చక్రి
సాహిత్యం : కులశేఖర్
గానం : శ్రీకృష్ణ, శ్వేతా మోహన్

నీలో నాలో ఊపిరి అమ్మరా
ఏమాటలకీ అందని జన్మరా
ఏమాటలకీ అందని జన్మరా
ఆ దివిలో దేవతలే పంపిన దీవెన అమ్మేరా
ఈ ఇలపై కాలిడినా అమృత వాహిని అమ్మేరా
మమతల సన్నిధి అమ్మేరా..
మనుజుల పెన్నిధి అమ్మేరా..

నీలో నాలో ఊపిరి అమ్మరా
ఏమాటలకీ అందని జన్మరా
ఏమాటలకీ అందని జన్మరా


పాలబువ్వ తినిపిస్తూనే జాబిలమ్మ అవుతుందమ్మా
వేలుపట్టి నడిపిస్తూనే పూలబాట అవుతుందమ్మా
జాలి జల్లు కురిసే వేళ మేఘమాలె అవుతుందమ్మా
జోలపాట పాడే వేళ హాయిరాగం అవుతుందమ్మా
లోకాలు చూపించు కనుపాప అమ్మేరా
శోకాలలో నీకు ఓదార్పు అమ్మేరా
లోకాలు చూపించు కనుపాప అమ్మేరా
శోకాలలో నీకు ఓదార్పు అమ్మేరా

ఆ దివిలో దేవతలే పంపిన దీవెన అమ్మేరా
ఈ ఇలపై కాలిడినా అమృత వాహిని అమ్మేరా
మమతల సన్నిధి అమ్మేరా..
మనుజుల పెన్నిధి అమ్మేరా..

నీలో నాలో ఊపిరి అమ్మరా
ఏమాటలకీ అందని జన్మరా
ఏమాటలకీ అందని జన్మరా


ఉగ్గుపాలు తాగిస్తూనే ఊసులెన్నో చెబుతుందమ్మా
చిట్టి కథలు వినిపిస్తూనే నీతులెన్నో చెబుతుందమ్మా
ఊరువాడ తిప్పేవేళా ఏనుగమ్మ అవుతుందమ్మా
ఇరుగు పొరుగు చూసేవేళా దిష్టిచుక్క అవుతుందమ్మా
ఈ జన్మలో నీకు తొలిచెలిమి అమ్మేరా
ఏ పుణ్యమో గానీ నీ కలిమి అమ్మేరా
ఈ జన్మలో నీకు తొలిచెలిమి అమ్మేరా
ఏ పుణ్యమో గానీ నీ కలిమి అమ్మేరా

ఆ దివిలో దేవతలే పంపిన దీవెన అమ్మేరా
ఈ ఇలపై కాలిడినా అమృత వాహిని అమ్మేరా
మమతల సన్నిధి అమ్మేరా..
మనుజుల పెన్నిధి అమ్మేరా..

నీలో నాలో ఊపిరి అమ్మరా
ఏమాటలకీ అందని జన్మరా
ఏమాటలకీ అందని జన్మరా 


2 comments:

మీ అమ్మగారు మీతోనే ఉంటారు యెప్పుడూ..

థాంక్స్ శాంతి గారు.. నిజమేనండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.