శనివారం, జనవరి 05, 2019

ఎర్రాని కుర్రదాన్ని గోపాల...

ప్రేమికుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమికుడు (1994)
సంగీతం : ఏ.ఆర్.రహమాన్ 
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, జానకి  

హే ఎర్రాని కుర్రదాన్ని గోపాల
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా

గోపాల గోపాల రేపల్లె గోపాల
 గోపాల గోపాల రేపల్లె గోపాల
కొండంత సింగారమందిస్తా నీయాల రేపల్లే గోపాలా

కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా

గోపాల గోపాల రేపల్లె గోపాల
కొండంత సింగారమందిస్తా నీయాల రేపల్లే గోపాలా

ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే
పిల్లవాడి రాకకోసం కళ్లతో వేచి వేచి చుశానే
ఆయాసం వచ్చేలా ఐదారు కిలోమీటర్లు నడిచానే
హాయి హాయి హాయి భలే హాయి హాయిలే
ఈ జోరు నీకేలా సందెపొద్దు దాకనువ్వాగలేవా
ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే
చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే
చెలియా నీ దేహం తళ తళ మెరిసే బంగారం
అరెరె ఏ నీ నోటా కవితలు పలికెను ఎన్నో

కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా

గోపాల గోపాల రేపల్లె గోపాల
కొండంత సింగారమందిస్తా నీయాల రేపల్లే గోపాలా

ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల

బుగ్గమీద ముద్దుపెడితే ఎక్కడో కలిగెను గిలిగింత
చెవిలోన ముద్దుపెడితె అమ్మమ్మ కళ్ళలోన కవ్వింత
మావయ్యో మావయ్య సిగ్గుమొగ్గలేసెను లేవయ్యా
లే లే లే లే లే లే సన్నాయి లే లే లే
అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూసాను నీలోన
చికుబుకు రైలే జోరుగా వదిలెను పొగలే
ఎత్తుపల్లమొస్తే నడకలో ఇక తికమకలే
అహా హా ఈ పూట కనివిని ఎరుగని యోగం
దొరికే ఈ చోట ఎవ్వరికి అందని స్వర్గం

కోడి కోసమొచ్చావా గోపాలా
దాన్ని బుట్ట కింద దాచాను గోపాలా
పుట్ట తేనే కావాలా గోపాలా
దాన్ని ముంతలోన వుంచాను గోపాలా

గోపాల గోపాల రేపల్లె గోపాల
కొండంత సింగారమందిస్తా నీయాల రేపల్లే గోపాలా

ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల

ఎర్రాని కుర్రదాన్ని గోపాలా
అహ చుర్రుమంది నీ చూపు నాకేలా
చక్కాని చుక్కనేను గోపాలా
నీకు చిక్కుతాను సై అంటె ఈ యాల

7 comments:

ఫుట్ టాపింగ్ సాంగ్..

అవునండీ అప్పట్లో సూపర్ హిట్ సాంగ్ కదా.. థాంక్స్ ఫర్ దకామెంట్ శాంతిగారు.

ఊపు ఉన్న పాట గానీ ... ఎందుకో అంతర్లీనంగా అసభ్యంగా ఉందన్న భావన నాకు 🙁. You have a dirty mind అనకండి 😀.

ధనుర్మాసంలో అన్నీ దేవుడి పాటలే పోస్ట్ చేసే అలవాటు అని మీరు గతంలో మీ బ్లాగ్ లోనే అన్నట్లు గుర్తు. (లేదా మీరన్నది కార్తీక మాసం గురించా? లేక కృష్ణాష్టమి సమయం గురించా? ఏమో సరిగా జ్ఞాపకం రావడం లేదు)

ముందుగా శ్రద్దగా నా బ్లాగ్ ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు నరసింహారావు గారు.

మీరు చెప్పినది కరెక్టేనండీ ధనుర్మాసంలో గత ఐదేళ్ళగా ఒకో ఏడు కృష్ణుడ్ని బేస్ చేసుకుని ఒకో థీమ్ సెలెక్ట్ చేసుకుని ఆ సిరీస్ లో పాటలు వేస్తున్నాను. అంటే ఒక ఏడాది మీరాభజన్స్ ఒకసారి కృష్ణుని భక్తి పాటలు, ఒక సారి కృష్ణుని గురించి సినిమాల్లో వచ్చిన సాంగ్స్ అలా.

ఈ ఏడాది కృష్ణుని పేరు ఉన్న సోషల్ సాంగ్స్ వేస్తున్నాను అందుకే అక్కడక్కడ కొన్ని ఇలాంటి మాస్ పాటలు కూడా వస్తున్నాయ్ :-) ఇక ఈ పాట గురించి మీరన్నది నిజమే తీసుకున్నవారికి తీసుకున్నన్ని మీనింగ్స్ ఉన్నాయనడంలో ఏం సందేహం లేదు :-)

🙂🙂
ఈ క్రింది మూడు పాటలూ నాకు చాలా ఇష్టం. ఇవి సోషల్ పాటలు కాదు గానీ ... కృష్ణభక్తికి సంబంధించినవే. మీరు ఇదివరకే ఇక్కడ పోస్ట్ చేశారా? చేసుండకపోతే మీ వీలును బట్టి చూడండి.
-------------------
మోహనరూపా గోపాలా (చిత్రం : కృష్ణప్రేమ)(ఆడియో మాత్రమే దొరికింది)
--------------------
కరుణా జూడవయా (చిత్రం : దీపావళి)
--------------------
సరే "చందన చర్చిత నీలకళేబర" ఎవర్ గ్రీన్ జయదేవుడి అష్టపది చెప్పనక్కర్లేదు (చిత్రం : తెనాలి రామకృష్ణ)
చందన చర్చిత (అష్టపది)




ఈ సిరీస్ ను మొదలు పెట్టినదే అష్టపదితోనండీ ఇదిగోండి ఆ పాట..
అష్టపది పోస్ట్

మోహన రూపా గోపాలా ఇక్కడ.. వీడియో ఉన్న ప్లేలిస్ట్ లింక్ కూడా ఉంది చూడండి పోస్ట్ లో.. మోహన రూపా గోపాల పోస్ట్

కరుణ జూడవయా ఇంకా ప్రచురించలేదండీ ఈ సిరిస్ కాకపోయినా మరో సంధర్బంలో ఉపయోగిస్తాను.. మంచిపాట గుర్తు చేశారు థాంక్స్. ఈ బ్లాగ్ రైట్ సైడ్ టాప్ లో వేణుగాన సమ్మోహనం లింక్ మీద క్లిక్ చేస్తే ఈ సిరీస్ లో ప్రచురించినపాటలన్నీ కనిపిస్తాయ్ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.