గురువారం, జనవరి 24, 2019

ఎక్కడ నువ్వున్నా(ఊల్లాల్లా)...

పేట చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పేట (2018)
సంగీతం : అనిరుధ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : నకాష్ అజీజ్

ఎయ్ ఎక్కడ నువ్వున్నా
తలుపు తట్టద సంతోషం
నీ పెదవి అంచులకు
మెరుపులు కట్టద ఆకాశం
అరె ముట్టడి చేస్తున్నా
నిన్ను వెలుతురు వర్షం
గుర్తుపట్టను పొమ్మంటే
అయ్యో నీదేగా లోపం

ఎక్కడ నువ్వున్నా
తలుపు తట్టద సంతోషం
నీ పెదవి అంచులకు
మెరుపులు కట్టద ఆకాశం
అరె ముట్టడి చేస్తున్నా
నిన్ను వెలుతురు వర్షం
గుర్తుపట్టను పొమ్మంటే
అయ్యో నీదేగా లోపం 

  
కళ్ళగ్గంతలు కట్టీ ఏంటీ చీకట్లనీ నిట్టూర్చొద్దూ
చుట్టూ కంచెలు కట్టీ లోకం చిన్నదనీ నిందించొద్దూ

రే బాబా నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా

హే నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా


హే జగమే నీ ఇల్లు జనమే నీ వాళ్ళూ
మనమంతా ఒకటంటే జగడాలకు చెల్లు
పిలిచే నీ కళ్ళూ ప్రేమకు వాకిళ్ళూ
పవనంలా ప్రతి మనిషిని ప్రశ్నిస్తూ వెళ్ళూ

హే జగమే నీ ఇల్లు జనమే నీ వాళ్ళూ
మనమంతా ఒకటంటే జగడాలకు చెల్లు
పిలిచే నీ కళ్ళూ ప్రేమకు వాకిళ్ళూ
పవనంలా ప్రతి మనిషిని ప్రశ్నిస్తూ వెళ్ళూ


రెండు గుండెల అంతరం ఎంతా
చేయి చాచిన దూరం కాదా
పరులే లేరనుకుంటే లోకం
ఒకటే కుటుంబమై పోదా

రే బాబా నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా

హే నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా

ఎయ్ ఎక్కడ నువ్వున్నా
తలుపు తట్టద సంతోషం
నీ పెదవి అంచులకు
మెరుపులు కట్టద ఆకాశం
అరె ముట్టడి చేస్తున్నా
నిన్ను వెలుతురు వర్షం
గుర్తుపట్టను పొమ్మంటే
అయ్యో నీదేగా లోపం 


2 comments:

తమిళ్ అన్నీ బావున్నాయి..తెలుగు లిరిక్స్ లో ఈ పాటే బావుందనిపించింది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.