ఆదివారం, జనవరి 13, 2019

యమునా తీరం...

ఆనంద్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆనంద్ (2004)
సంగీతం : కె.ఎం.రాథాకృష్ణ
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, చిత్ర  

యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
 
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో 
 నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో
గోదారి మెరుపులతో


యమునా తీరం సంధ్యా రాగం

ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలేదే ప్రేమా
చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమా

మరువకుమా ఆనందమానందం
ఆనందమాయేటి మధుర కథా
మరువకుమా ఆనందమానందం
ఆనందమాయేటి మధుర కథా

యమునా తీరం సంధ్యా రాగం
  
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా

శిధిలంగా విధినైనా చేసేదే ప్రేమా
హృదయంలా తననైనా మరిచేదే ప్రేమా
మరువకుమా ఆనందమానందం
ఆనందమాయేటి మనసు కథా

మరువకుమా ఆనందమానందం
ఆనందమాయేటి మనసు కథా

యమునా తీరం సంధ్యా రాగం 
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో 
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో 
నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో 
గోదారి మెరుపులతో
 
 

4 comments:

చాలా అందమైన పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

చరణం అటూ ఇటూ ఐపొయింది..

గుడ్ క్యాచ్ అజ్ఞాత గారూ... ఆడియోలో అలా ఉన్నట్లున్నాయండీ.. నేను వీడియో చూసి వెరిఫై చేసి ఆడియోలో కూడా ఇంతే ఉన్నాయనుకున్నాను. సినిమాలో కూడా ఇక్కడ ఉన్న ఆర్డర్ లోనే ఉన్నాయ్. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.