శుక్రవారం, జనవరి 25, 2019

సర్వం తాళ మయం...

సర్వం తాళ మయం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సర్వం తాళమయం (2019)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : రాకేందు మౌళి
గానం : హరిచరణ్

మొదలయ్యే హృదయం సవ్వడి
గర్భాన తొలిగా
గర్వాల ఆటే ఆడి
ఆగేనే తుదిగా
గగనాలే ఘర్జించేనూ
తలబడితే మేఘాలే
సంద్రాలే హోరెత్తేనూ
కలబడితే అలలే

దేహం ప్రాణం ఆడే క్షణం
ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం


మొలిచేటీ రెక్కల్లో
పిలిచేనీ తాళం
జలజలజల జారే కొండల
ధ్వనిలోని చలనం
గలగలగల పారే నదుల
ధ్వనిలోని గమనం
కుహుకుహు కూసే కోయిల
ధ్వనిలోని మధురం
కిలకిలకిల ఊగే కొమ్మల
ధ్వనిలోని తన్మయం

దేహం ప్రాణం ఆడే క్షణం
ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం


పిపీలికం సరాల నడకే
వింటే స్వరతాళం కదా
మొగ్గే తుంచి తేనే జుర్రేసే
భ్రమరాల సడి తాళం వేయ్ రా
నేల మేళాన మోగించే వాన
నాట్యం చేసే చిటపట చినుకె
నీలో నిప్పు చప్పుళ్ళే అవి
నువ్వు నేనూ కాలాన్ని తాళం
జన్మించాం కలసిన లయలో
జీవించాం కల్లల లయలో
థై థై థై దిథై లయలో
తై తై తై.. తి త త

ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

మొదలయ్యే హృదయం సవ్వడి
గర్భాన తొలిగా
గర్వాల ఆటే ఆడి
ఆగేనే తుదిగా
గగనాలే ఘర్జించేనూ
తలబడితే మేఘాలే
సంద్రాలే హోరెత్తేనూ
కలబడితే అలలే

దేహం ప్రాణం ఆడే క్షణం
ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

మొలిచేటీ రెక్కల్లో
పిలిచేనీ తాళం

ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం 


2 comments:

పెరే అద్భుతం గా ఉంది..సర్వం తాళమయం..వెరీ ట్రూ..యాంక్షియస్లీ వెయిటింగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. అవునండీ ఇంట్రెస్టింగ్ టైటిల్.. నేను సినిమా కోసం వెయిటింగ్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.