పుణ్యవతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : పుణ్యవతి (1967)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల
మనసు పాడింది సన్నాయి పాట
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ... తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ ఆ ....
మనసు పాడింది సన్నాయి పాట
జగమే కల్యాణ వేదికగా
సొగసే మందార మాలికగా
జగమే కల్యాణ వేదికగా
సొగసే మందార మాలికగా
తొలిసిగ్గు చిగురించగా..ఆ ఆ ఆ ఆ
తొలిసిగ్గు చిగురించగా
నా అలివేణి తలవాల్చిరాగ
మనసు పాడింది సన్నాయి పాట...
చిలికే పన్నీటి వెన్నెలలోనా
పిలిచే విరజాజి పానుపుపైనా
చిలికే పన్నీటి వెన్నెలలోనా
పిలిచే విరజాజి పానుపుపైనా
వలపులు పెనవేసుకోగా..ఆ..
వలపులు పెనవేసుకోగా
నా వనరాజు ననుచేర రాగా
మనసు పాడింది సన్నాయి పాట...
మదిలో దాచిన మమతలతేనెలు
పెదవులపైనే కదలాడగా
మదిలో దాచిన మమతలతేనెలు
పెదవులపైనే కదలాడగా
పెదవులకందనీ మధురిమలేవో..ఓ..ఓ... ఆ..
పెదవులకందనీ మధురిమలేవో
హృదయాలు చవిచూడగా
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ... తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ...ఆ ....
మనసు పాడింది సన్నాయి పాట
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.