గురువారం, ఏప్రిల్ 21, 2016

చిగురాకుల ఊయలలో...

కానిస్టేబుల్ కూతురు చిత్రంలోని ఓ మధురగీతాన్ని నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కానిస్టేబుల్ కూతురు (1962)
సంగీతం : ఆర్. గోవర్ధన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల,
పి. బి. శ్రీనివాస్

చిగురాకుల ఊయలలో 
ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో 
నా మనసును చిలికేవో..ఓ..ఓ
చిగురాకుల ఊయలలో 
ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

నీ అడుగుల జాడలలో
నా నీడను కలిపేనా  
నీ అడుగుల జాడలలో
నా నీడను కలిపేనా
నీ చూపుల కాంతులలో.. 
నా రూపును నిలిపేనా..ఆ..ఆ..అ

చిగురాకుల ఊయలలో 
ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

నా దారిలో నిను జూచి 
నును సిగ్గుతో తొలగేనా ఆ ఆ ఆ 
 నా దారిలో నిను జూచి 
నును సిగ్గుతో తొలగేనా ఆ ఆ ఆ
కలలో నిను కనినంతా 
నిజమే అని పిలిచేనా..ఆ..ఆ..ఆ

చిగురాకుల ఊయలలో 
ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో 
మా చెల్లిని పిలిచేవో..ఓ..ఓ..
చిగురాకుల ఊయలలో 
ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ
 
విరిపూలతో ఆడును లే 
చిరుగాలితో పాడును లే
విరిపూలతో ఆడును లే 
చిరుగాలితో పాడును లే
మా చెల్లెలు బాల సుమా 
ఏమెరుగని బేల సుమా..ఆ..ఆ..ఆ

చిగురాకుల ఊయలలో 
ఇల మరచిన ఓ చిలుకా
మధురాశలు పలికేవో 
మా చెల్లిని పిలిచేవో..ఓ..ఓ..
చిగురాకుల ఊయలలో 
ఇల మరచిన ఓ చిలుకా ఆ ఆ

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.