గురువారం, ఏప్రిల్ 28, 2016

ఈ రోజు... మంచి రోజు..

ప్రేమలేఖలు చిత్రం కోసం సత్యం గారి సంగీత సారధ్యంలో వచ్చిన ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమలేఖలు (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : సుశీల, వాణీ జయరాం

ఆ ఆ ఆ ఆ ఆ ....
ఈ రోజు... మంచి రోజు..
మరపురానిది.. మధురమైనది
మంచితనం ఉదయించినరోజు


ఆ ఆ ఆ ఆ...
ఈ రోజు.. మంచి రోజు...
మరపురానిది.. మధురమైనది
ప్రేమ సుమం వికసించినరోజు

తొలిసారి ధృవతార దీపించెను
ఆ కిరణాలే లోకాన వ్యాపించెను

ఆ ఆ ఆ ఆ..
తొలి ప్రేమ హృదయాన పులకించెను
అది ఆనంద దీపాలు వెలిగించెను

చెలికాంతులలో.. సుఖశాంతులతో
జీవనమే పావనమీనాడు

ఈ రోజు మంచి రోజు...
మధురమైనది మరపురానిది
ప్రేమ సుమం వికసించినరోజు


రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము
రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము

మనసు మనసు లొకరికొకరు తెలిపే రోజు
తీరని కోరికలన్నీ తీరే రోజు
అనురాగాలు..అభినందనలు
అందించే శుభసమయం నేడు

ఈ రోజు మంచి రోజు...
మధురమైనది మరపురానిది
మంచితనం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.