బుధవారం, ఏప్రిల్ 06, 2016

నిన్నే నిన్నే తలచుకుని...

పెళ్ళి చూపులు చిత్రం కోసం మహదేవన్ గారు స్వరపరచిన ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

చిత్రం : పెళ్ళి చూపులు (1983)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

కిట్టయ్యంటే నువ్వేనని పిల్లనగ్రోవి నేనేనని
పెదవుల పైనే వుండాలని పదములు ఎన్నో పాడాలని
కిట్టయ్యంటే నువ్వేనని పిల్లనగ్రోవి నేనేనని 
పెదవుల పైనే వుండాలని పదములు ఎన్నో పాడాలని

బృందావనం తగదనీ అందరితో తగువనీ
యమున దాటి వెళ్ళాలని వేచివున్న వెర్రిదాన్ని
నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

సీతమ్మంటే నువ్వేనని రాముడు నేనై వుండాలని
రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని
సీతమ్మంటే నువ్వేనని రాముడు నేనై వుండాలని
రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని
పగలు పగలు అనుకుని.. రాత్రి రాత్రి కలగని
పగలు పగలు అనుకుని.. రాత్రి రాత్రి కలగని
కలే నిజం అవుతుందని కాచుకున్న పిచ్చివాణ్ణీ

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

ఆహాహాహా... హాహాహహా...ఆహాహాహా... హాహాహహా

1 comments:

నిన్నే నిన్నే తలచితి
ఎన్నో నాళ్ళన జిలేబి యెడబాటు గదా !
మిన్నాగువి గద రమణీ !
నన్నీదరి జేర నీయ నాదరి రావే !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.