గురువారం, మార్చి 03, 2016

నీ నవ్వే హాయిగా వుంది...

మొన్న సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రం "సోగ్గాడే చిన్ని నాయన" చిత్రం కోసం అనూప్ రూబెన్స్ స్వర సారధ్యంలో శ్రేయ గానం చేసిన ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. పూర్తిపాట లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సోగ్గాడే చిన్నినాయనా (2016)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : బాలాజి
గానం : శ్రేయ ఘోషల్, ధనుంజయ్

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ 
ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా 
అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు 
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ 
ఏమైపోయింది
 
ప్రతిక్షణమూ మనసుపడీ
కలలుకనే నేనే అర్ధం కానా
రుస రుసలే చూపిస్తున్న
నను దూరం చేస్తూవున్నా
నాకోసం ఓ క్షణమయినా 
ఆలోచిస్తే చాలన్నా

నిన్నల్లో ఊపిరి నువ్వే
నా రేపటిలో ఆయువు నువ్వే
నీకోసమే నే మారన
నీతోడిలా నాతోడుగా వుంటే 
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ 
ఏమైపోయింది
 
తడబడితే పెదవులిలా
కనపడదా నాలో నీపై ఆశ
నీ చల్లని మాటల కోసం
లోలోపల ఎదురే చూసా
నీ ముద్దుముచ్చట కోసం
పడిగాపులు ఎన్నో కాసా

చుక్కల్లో జాబిలి నువ్వే
నా గుండెల్లో వెన్నెల కావే
నీ శ్వాసలో ఈ గాలిలా
నూరేళ్ళిలా నే వుండిపోతాలే
హొ హొ హొ హొ హొ

నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ 
ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా 
అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు
హొ హొ హొ హొ హొ హోహో


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.